Sai Rajesh: ఆరు 'నిబ్బా నిబ్బీ' లవ్ స్టోరీలు ఉన్నాయి.. నేను లోకేష్‌ కనగరాజ్‌ కాదు: సాయి రాజేష్‌

31 Oct, 2023 12:52 IST|Sakshi

బేబీ సినిమాతో డైరెక్టర్‌గా సాయి రాజేష్‌కు గుర్తింపు వచ్చినా ఆయన మొదటగా ‘హృదయకాలేయం’ చిత్రంతో ఇండస్ట్రీకి పరిచయం అయ్యాడు. తర్వాత కొబ్బరి మట్ట సినిమాను కూడా డైరెక్ట్‌ చేశాడు. ఆ రెండూ సినిమాలకు సంబంధించిన మీమ్స్‌ ఇప్పటికీ సోషల్‌ మీడియాలో ట్రెండ్‌ అవుతూ ఉంటాయి. తర్వాత కలర్ ఫోటోతో నిర్మాతగా మెప్పించాడు.బేబీ సినిమాను నిర్మాత ఎస్కేఎన్‌తో కలిసి సాయి రాజేష్‌ తెరకెక్కించాడు. ఆ సినిమా సూపర్‌ హిట్‌ అందుకుంది. మొత్తం ఆరు ప్రేమకథలు నిర్మించబోతున్నట్లు  ‘బేబి’ దర్శకుడు సాయి రాజేష్ ప్రకటించారు.

(ఇదీ చదవండి: దొరికిపోయిన రతిక.. మోకాళ్లపై కూర్చుని దండం పెట్టిన అమర్!)

కలర్‌ ఫోటో,బేబీ సినిమాలు ఇప్పటికే విడుదలయ్యాయి..  మరో రెండు ప్రేమకథలు నిర్మాణంలో ఉన్నాయి. త్వరలో ఇంకో రెండు కథలు త్వరలో ప్రకటిస్తామని ఆయన చెప్పారు. ఇండస్ట్రీలో మంచి స్నేహితులుగా కొనసాగుతున్న సాయి రాజేష్, ఎస్కేఎన్‌ ఇద్దరూ.. గీతా ఆర్ట్స్ కాంపౌండ్‌లో ఉంటూ చాలా రోజులుగా కలిసి పనిచేస్తున్నారు. అలా బేబీ హిట్‌తో వారిద్దరి పేర్లు సెన్సేషన్‌ అయ్యాయి. తాజాగా వీరి నుంచి మరో సినిమా ప్రకటన వచ్చిన విషయం తెలిసిందే.. 

సంతోష్ శోభన్ హీరోగా రూపొందుతోన్న ఈ సినిమాకు సాయి రాజేష్ కథ, స్క్రీన్‌ప్లే అందిస్తుండగా.. వారి బ్యాచ్‌లో ఉన్న మరో స్నేహితుడు సుమన్ పాతూరి ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. బేబీ సినిమాతో తెలుగమ్మాయి వైష్ణవి చైతన్యకు హిట్‌ ఇచ్చిన తర్వాత ఇప్పుడు మరో తెలుగమ్మాయి.. 'బిగ్ బాస్' ఫేమ్ అలేఖ్య హారికను కథానాయకిగా పరిచయం చేయడం విషేశం. 'అమృత ప్రొడక్షన్స్‌' నుంచి ఇప్పటి వరకు మూడు సినిమాలు నిర్మించిగా. ఆఖరి సినిమాగా కలర్ ఫోటో వచ్చిందని సాయి రాజేష్‌ గుర్తు చేశారు. ఆ చిత్రానికి ఉత్తమ చిత్రంగా జాతీయ అవార్డు కూడా వచ్చింది.  

నేనేమీ లోకేష్‌ కనగరాజ్‌ కాదు
ఆ తర్వాత తాను నిర్మాతగా  సినిమాలు నిర్మించలేదని సాయి రాజేష్‌ ఇలా చెప్పుకొచ్చాడు. ఒక మంచి కథ వచ్చినప్పుడు నేను మళ్లీ సినిమా నిర్మించాలని అనుకున్నాను. ఈ కథ ప్రేక్షకులను మెప్పిస్తుంది.  సోషల్‌ మీడియాలో కొందరు ఎన్ని తీస్తారురా 'నిబ్బా నిబ్బీ' లవ్ స్టోరీలు అని  బాదకముందే నేనే ముందుగా చెప్తున్నాను. నాది, ఎస్కేఎన్ కాంబినేషన్‌లో మొత్తం 6 ప్రేమకథలు రాబోతున్నాయి. వీటిలో రెండు మీరు చూసేశారు. ఒకటి కలర్ ఫోటో.. రెండోది బేబి. రెండు నిర్మాణంలో ఉన్నాయి.. వైష్ణవి, ఆనంద్ కాంబినేషన్‌లో రీసెంట్‌గా ఒక సినిమా ప్రకటించాం.

ఇప్పుడు సంతోష్, హారిక కాంబినేషన్‌లో ఈ సినిమా రానుంది. ఇవి కాకుండా ఇంకో రెండు లవ్ స్టోరీలు ఉంటాయి.  కొందరు మాత్రం ఇదేమైనా సినిమాటిక్ యూనివర్సా.. స్టోరీలో ఏమైనా లింక్ అయ్యాయా..? సీక్వెల్ ఉంటుందా..? అంటే నేనేమీ లోకేష్ కనగరాజ్ కాదు.. ఆ విషయం నాకు కూడా తెలుసు. కానీ.. మీ అందర్నీ మెప్పించేలా ఆరు ప్రేమ కథలు ఉన్నాయి. అవి నేను, ఎస్కేఎన్ కలిసి మీకు అందిస్తున్నాం. వాటిలో ఇదీ ఒకటి. ఇది నా మనసుకు చాలా దగ్గరైన ప్రేమ కథ. ఈ ప్రాజెక్ట్‌లో నాకు చాలా బాధ్యతలు ఉన్నాయి.

ఎందుకంటే డైరెక్టర్ సుమన్ పాతూరి, హారిక అలేఖ్య, కలర్ ఫోటో డైరెక్టర్ సందీప్, సుహాస్, మేమందరం చాలా సంత్సరాలుగా స్నేహితులం. ఎస్కేఎన్, నేను చిన్నప్పటి నుంచీ ఫ్రెండ్స్. అందరం ఫ్రెండ్స్ కలిసి ఫ్రెండ్స్ కోసం చేస్తున్న సినిమా ఇది. కచ్చితంగా ఒక బ్లాక్ బస్టర్ కొట్టాలని ఎక్కడా కాంప్రమైజ్ అవ్వకుండా ఈ సినిమా తీస్తున్నాం.' అని సాయి రాజేష్ చెప్పారు.

మరిన్ని వార్తలు