రిపబ్లిక్‌కి ముహూర్తం

2 Feb, 2021 06:29 IST|Sakshi

సాయితేజ్‌ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘రిపబ్లిక్‌’. ‘ప్రస్థానం’ వంటి డిఫరెంట్‌ పొలిటికల్‌ మూవీని తెరకెక్కించిన దేవా కట్టా ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. జె. భగవాన్, జె. పుల్లారావు నిర్మాతలు. ఈ సినిమాని జూన్‌ 4న విడుదల చేయనున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. ఈ సందర్భంగా జె. భగవాన్, జె. పుల్లారావు మాట్లాడుతూ – ‘‘సాయితేజ్‌ ఇప్పటివరకు చేసిన చిత్రాలకు భిన్నంగా మా ‘రిపబ్లిక్‌’ రూపొందుతోంది. ఇటీవల విడుదల చేసిన ఈ సినిమా మోషన్‌ పోస్టర్, అందులోని కాన్సెప్ట్‌కి ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వచ్చింది. ప్రస్తుతం మా సినిమా చిత్రీకరణ శరవేగంగా జరుగుతోంది. జూన్‌ 4న ప్రపంచవ్యాప్తంగా భారీ ఎత్తున సినిమాని విడుదల చేస్తున్నాం’’ అన్నారు. ఐశ్వర్యా రాజేశ్, జగపతిబాబు, రమ్యకృష్ణ, సుబ్బరాజు, రాహుల్‌ రామకృష్ణ, బాక్సర్‌ దిన తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: ఎం. సుకుమార్, సంగీతం: మణిశర్మ.

మరిన్ని వార్తలు