మెగా, అక్కినేని హీరోల కాంబో భారీ మల్టీస్టారర్?

20 Nov, 2021 17:30 IST|Sakshi

మెగాహీరోల్లో ఒక్కోక్కరిది ఒక్కో శైలి. ఎవరి పంథాలో వాళ్లు దూసుకుపోతున్నారు. వారందరికంటే భిన్నంగా ఆలోచిస్తున్నాడు సుప్రీమ్ హీరో సాయి తేజ్. కమర్షియల్ మూవీస్ చేస్తూనే చాలా కాలంగా మల్టీస్టారర్ చేయాలనుకుంటున్నాడు. కాని కుదరడంలేదు. ఇప్పుడు ఆ ప్రయత్నం ఒక కొలిక్కి వచ్చినట్లు కనిపిస్తోంది.

నిజానికి సాయిధరమ్ తేజ్, నందమూరి కల్యాణ్ రామ్ తో ఓ మల్టీస్టారర్ చేయాల్సి ఉంది. కాని ఈ ప్రాజెక్ట్ పెండింగ్ లోకి వెళ్లిపోయింది. 1982 సూపర్ హిట్ బిల్లా రంగా సీక్వెల్లో మంచు మనోజ్, సాయి ధరమ్ తేజ్ కలసి నటించాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నారు. ఎందుకో కుదరడం లేదు.

గత ఏడాది వరుణ్ తేజ్ తో కలసి సాయి ధరమ్ తేజ్ ఒక మల్టీస్టారర్ మూవీ చేయబోతున్నాడని టాక్ వినిపించింది. ఈ మెగా మల్టీస్టారర్ ను గీతా ఆర్ట్స్ నిర్మించనున్నట్లు ప్రచారం సాగింది. కాని ఇంతలో కరోనా ఎంట్రీ ఇవ్వడంతో ఈ మెగా మల్టీస్టారర్ ప్రాజెక్ట్ ప్రస్తుతానికి పక్కకు వెళ్లింది.

ప్రస్తుతం సాయిధరమ్ తేజ్ దగ్గరికి ఒక మల్టీస్టారర్ స్టోరీ వెళ్లిందట. ఈ సినిమాను అక్కినేని అఖిల్ లేదా అక్కినేని నాగ చైతన్య తో కలసి నటించాలనుకుంటున్నాడట తేజ్. మరి ఈసారైనా ఈ మెగా హీరో మెగా మల్టీస్టారర్ డ్రీమ్ నెరవేరుతుందా లేక రూమర్ గా మిగిలిపోతుందా అన్నది కొద్ది రోజులు ఆగితే తెల్సిపోతుంది.

మరిన్ని వార్తలు