ఎమ్‌ఎక్స్‌ ప్లేయర్‌లో ఉచితంగా సబ్‌కాసాయి సిరీస్‌

3 Sep, 2021 20:33 IST|Sakshi

అనేక మంది జీవితాలను స్పృశించి, సుసంపన్నం చేసిన భారతదేశ వ్యాప్తంగా పూజించే సాధువు - సాయిబాబా జీవిత చరిత్ర ఆధారంగా సబ్‌కాసాయి సిరీస్‌ తెరకెక్కింది. ఎమ్‌ఎక్స్‌ ప్లేయర్‌ ఒరిజినల్‌ సిరీస్‌ ఈ మూవీ ట్రైలర్‌ను ఈరోజు విడుదల చేసింది. భారతదేశంలో గొప్ప సూఫీ సద్గురువు - సాయి బాబా. మతం పేరిట విద్వేషాన్ని వ్యాప్తి చేయడంపై సైన్స్‌, మెడిసిన్‌ను విశ్వసించే వారి నుండి ఎదురైన వ్యతిరేకత, భారతదేశ స్వాతంత్య్ర సమరయోధులకు ఆయన ఇచ్చిన మద్దతు వరకు మొత్తం ఆంశాల ఆధారంగా ఈ మూవీని తెరకెక్కించారు.  ఆయన అభిప్రాయాల వృత్తాంతం, వితంతు పునర్వివాహం, మతాంతర వివాహాలను అంగీకరించడంపై ఆయన ఉదారమైన విశ్వాసం అనేక ప్రతిఘటనలను ఎదుర్కొన్న ప్రతి అంశాలను ఈ మూవీలో చూపించనున్నారు. దత్తత శిశువుగా మొదలుకుని యుక్తవయస్సులో ఎదుర్కొన్న అనేక కష్టనష్టాల నుంచి మొదలైన ఆయన ప్రయాణం, ‘షిర్డీ సద్గురువు’గా భారత స్వాతంత్య్ర సంగ్రామ పోరాటంతో పాటు ప్లేగు వంటి అంటువ్యాధులు ప్రభలిన చారిత్రక సంఘటనలలో ఆయన  ప్రమేయాన్ని ఇందులో అందంగా వివరించారు. 

రాజ్‌ అర్జున్‌ ప్రధాన పాత్రలో నటించిన ఈ 10 ఎపిసోడ్ల ఈ పౌరాణిక సిరీస్‌కు అజిత్‌ భైరవాకర్‌ దర్శకత్వం వహించారు. షిర్డీలో జన్మించిన దర్శకుడు అజిత్‌ భైరవాకర్‌ ఈ సిరీస్‌ ట్రైలర్‌ గురించి మాట్లాడుతూ.. ‘ఈ సిరీస్‌లో, సాయిబాబ ఎదుర్కొన్న నిజ జీవిత సవాళ్లతో పాటు, ఇప్పుడు  పూజించబడుతున్న దేవునిగా కాకుండా సాయిబాబాను ఒక మానవమాత్రునిగా చిత్రీకరించడానికి మేము ప్రయత్నించాము. బాబా ప్రగతిశీల ఆలోచనలు, మొత్తం మానవజాతి పట్ల ఆయనకున్న కరుణ, వాత్సల్యం, ఆయన గురించి మనకు అంతగా తెలియని కథలు ఈ కథనంలో సజీవంగా తీసుకురావడానికి ప్రయత్నించాము. అన్ని మతాల ప్రజల నుండి కూడా ఆయనకు అత్యధికసంఖ్యలో ఉన్న భక్తుల దృగ్విషయాన్ని తెలియజేయడానికి కూడా ఈ సిరీస్‌ ప్రయత్నిస్తుంది’ అని పేర్కొన్నారు. కాగా తెలుగు, హిందీ, తమిళ భాషల్లో ఈ సీరిస్‌ ఎమ్‌ఎక్స్‌ ప్లేయర్‌లో ఉచితంగా ప్రసారం అవుతుంది.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు