బంటీ ఔర్‌ బబ్లూ ఇప్పుడు రారు!

26 Mar, 2021 10:11 IST|Sakshi

రానా నటించిన ‘హాథీ మేరే సాథీ’ (తెలుగులో ‘అరణ్య’గా ఈ చిత్రం నేడు విడుదలవుతోంది) సినిమా తర్వాత మరో బాలీవుడ్‌ మూవీ ‘బంటీ ఔర్‌ బబ్లీ 2’ విడుదల వాయిదా పడింది. మహారాష్ట్రలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో థియేటర్స్‌కు ఆడియన్స్‌ రారని, ఆ ప్రభావం కలెక్షన్స్‌పై పడుతుందని భావించిన యశ్‌ రాజ్‌ నిర్మాణసంస్థ ఏప్రిల్‌ 23న విడుదల కావాల్సిన ‘బంటి ఔర్‌ బబ్లీ 2’ సినిమా విడుదలను వాయిదా వేసింది.

2005లో వచ్చిన ‘బంటీ ఔర్‌ బబ్లీ’ సినిమాకు సీక్వెల్‌గా ‘బంటీ ఔర్‌ బబ్లీ 2’ తెరకెక్కింది. వరుణ్‌ శర్మ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సైఫ్‌ అలీఖాన్‌, రాణీ ముఖర్జీ, సిద్ధార్థ్‌ చతుర్వేదీ, షార్వారీ ప్రధాన పాత్రలు పోషించారు.

చదవండి: బిగ్‌బాస్‌ కంటెస్టెంట్‌కు సల్మాన్‌ కానుక‌‌

భర్త నగ్న ఫొటోను షేర్‌ చేసిన సన్నీ లియోన్‌

మరిన్ని వార్తలు