నేను కరీనాకు ఏ విషయంలోనూ సలహాలు ఇవ్వను: సైఫ్‌ అలీ ఖాన్‌

1 Oct, 2021 14:33 IST|Sakshi

బాలీవుడ్‌లోని సెటబ్రిటీ కపుల్‌ సైఫ్‌ అలీ ఖాన్‌, కరీనా కపూర్‌లు ప్రేమ వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. ఈ జంటకి ఇద్దరు కుమారులు తైమూర్‌, జెహ్‌. సినిమాలతో ఇద్దరూ ఎంతో బిజీగా ఉన్నప్పటికీ వ్యక్తిగత జీవితానికి సమయాన్ని కేటాయిస్తుంటారు. అయితే వ్యక్తిగత విషయాన్ని, ఫ్యామిలీ ఫొటోలను షేర్‌ చేస్తూ కరీనా సోషల్‌ మీడియాలో యాక్టివ్‌గా ఉంటుండగా,  సైఫ్ మాత్రం సోషల్‌ మీడియాకు దూరంగా ఉంటాడు.  

ఇటీవల సైఫ్‌ ఓ ఇంటర్వూలో కరీనా సోషల్ మీడియాలో యాక్టివ్‌ ఉండటం, పోస్టుల పెట్టడంపై హోస్ట్‌ అడగ్గా.. సైఫ్‌ దానికి ఇలా సమాధానం ఇచ్చాడు. ‘స్వచ్చమైన పెళ్లి బంధంలో ఒకరిని ఒకరు కంట్రోల్‌ చేసుకోవడం ఉండదు. ఇద్దరూ ఎవరికి నచ్చింది వారు చేయొచ్చు. కరీనా మల్టీ టాస్కర్‌. అందుకే తన ఏం చేయాలకుంటుందో అది చేస్తుంది. అందుకే నేను తనకు అంతగా సలహాలు ఇవ్వను.

చదవండి: బిగ్‌బాస్‌లోకి సుశాంత్‌ ప్రేయసి?.. వామ్మో! వారానికి అన్ని లక్షలా..

ఒక్క సోషల్‌ మీడియా విషయంలోనే కాదు.. మామూలుగా విషయాల్లోనైనా బెబోకు సలహాలు ఇవ్వను. ఏం చేయాలో తనకి బాగా తెలుసు’ అంటూ చెప్పుకొచ్చాడు. కాగా కరీనా చివరిగా అమీర్‌ ఖాన్‌ ‘లాల్‌ సింగ్‌ చద్దా’లో నటించింది. ఇటీవల షూటింగ్‌ను పూర్తి చేసుకున్న ఈ మూవీ ప్రస్తుతం పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనులను జరపుకుంటుంది. త్వరలోనే ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక సైఫ్‌ ప్రసుత్తం ప్రభాస్‌ హీరోగా చేస్తున్న ‘ఆదిపురుష్‌’లో రావణ్‌ పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే. 

చదవండి: ఆ గాట్లు పెట్టినవి కాదు.. ఆ సినిమా సమయంలో నిజంగా అయ్యాయి: యంగ్‌ హీరో


 

మరిన్ని వార్తలు