‘థ్యాంక్యూ బ్రదర్‌ ఇంటర్నేషనల్‌ ఫిలిం ఫెస్టివల్‌కు వెళ్లాలనుకున్న’

10 May, 2021 18:06 IST|Sakshi

బుల్లితెర ప్రేక్షకులకు అనసూయ భరద్వాజ్‌ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అందంతో పాటు తనదైన యాంకరింగ్‌తో లక్షలాది అభిమానులను సంపాదించుకుంది. పేరుకు యాంకర్ అయినా కూడా హీరోయిన్‌కు ఏ మాత్రం తీసిపోని ఇమేజ్, అందం ఈమె సొంతం. ఒకవైపు యాంకరింగ్‌ చేస్తూనే మరోవైపు సినిమాల్లో వైవిధ్యమైన పాత్రలతో ప్రేక్షకులకు మరింత చేరువయ్యింది. కథ నచ్చితే ఎలాంటి పాత్ర చేయడానికైనా సిద్ధంగా ఉంటుంది అనసూయ. చాలా కాలం తర్వాత ఆమె ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘థ్యాంక్‌ యు బ్రదర్‌’. అనసూయ గర్భిణిగా నటించిన ఈ చిత్రం మే 7న ప్రముఖ తెలుగు ఓటీటీ ‘ఆహా’లో విడుదలైంది.

గర్భిణి అయిన అనసూయ ఆస్పత్రికి వెళ్లినప్పుడు అక్కడ ఓ యువకుడితో కలిసి లిఫ్ట్‌లో ఇరుక్కుపోతుంది. ఆ సమయంలో ఆమెకు పురిటి నొప్పులు మొదలవడంతో ఆ తర్వాత ఏం జరిగిందనేదే ఈ కథ. ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి పాజిటివ్‌ టాక్‌ అందుకుని సక్సెస్‌ బాట పట్టింది. ఇందులో అనసూయ పాత్ర విమర్శకుల నుంచి ప్రశంసలు అందుకుంది. ఈ నేపథ్యంలో మదర్స్‌ డే సందర్భంగా సాక్షి టీవీ ఈ మూవీ విషయాలపై అనసూయతో ముచ్చటించింది. ఈ సినిమా సక్సెస్‌, తన పాత్ర గురించి అనసూయ మాటల్లో విందాం. 

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు