నాని ‘వీ’ చిత్రంపై కోర్టుకెక్కిన నటి..

3 Mar, 2021 17:07 IST|Sakshi

బాలీవుడ్ ‘సోను కే టిటు కీ స్వీటీ’ చిత్రంలోని ‘బామ్‌ డిగ్గీ డిగ్గీ’ అనే పాటతో సాక్షి ప్రాచుర్యంలోకి వచ్చారు నటి, మోడల్‌ సాక్షి మాలిక్‌. ఇటీవల ఆమె టాలీవుడ్‌ హీరో నాని నటించిన వీ చిత్రంపై కోర్టుకెక్కారు. ఇంద్రగంటి మోహన కృష్ణ తెరకెక్కిన ఈ చిత్రంలో అనుమతి లేకుండా తన ఫోటోను ఉపయోగించారని ఆరోపిస్తూ నిర్మాతపై బాంబే హైకోర్టులో పరువు నష్టం దావా వేశారు. నాని, సుధీర్‌ బాబు, నివేదా థామస్‌, అదితిరావు హైదరి ప్రధాన పాత్రలో నటించిన వీ చిత్రంలో.. మొబైల్ ఫోన్‌లో కమర్షియల్ సెక్స్ వర్కర్ ఫొటోను వేరే వ్యక్తికి చూపించే సన్నివేశం ఉంది. అయితే ఆ ఫొటో తనదేనని ఆరోపిస్తూ సాక్షి మాలిక్ కోర్టుకెక్కారు. 

దీనిపై స్పందించిన బాంబే కోర్టు.. ‘వి’ చిత్రం స్ట్రీమింగ్ అవుతోన్న ఓటీటీ ప్లాట్‌ఫాంకు ఆదేశాలు జారీ చేసింది. అనుమతి లేకుండా వేరే వ్యక్తుల ఫోటోలను, ముఖ్యంగా ప్రైవేట్ ఇమేజ్‌ను ఉపయోగించడం చట్ట విరుద్ధమని, ఇలా వాడటం వల్ల తమ పరువుకు నష్టం కలింగించవచ్చని పేర్కొంది. సాక్షి మాలిక్‌ అభ్యంతరం తెలిపిన సినిమాలోని సన్నివేశాలను ​వెంటనే తొలగించాలని ఆదేశించింది, సీన్స్‌ డిలీట్‌ చేసిన తర్వాతనే సినిమాను తిరిగి అప్‌లోడ్‌ చేయాలని ప్రొడక్షన్‌ హౌజ్‌ను ఆదేశించింది. అదే విధంగా తిరిగి అప్‌లోడ్‌ చేసేముందు సాక్షికి చూపించాలని పేర్కొంది. దీంతో ఇప్పటికే ‘వి’ సినిమాను ఇప్పటికే ఓటీటీ ప్లాట్‌ఫాం నుంచి తొలగించారు. కాగా వెంకటేశ్వర క్రియేషన్స్‌ బ్యానర్‌పై దిల్‌ రాజ్‌ నిర్మించిన ఈ చిత్రం గతేడాది సెప్టెంటర్‌ 5న ఓటీటీలో విడుదలైంది.

చదవండి: నాని నో చెప్పాడు.. వైష్ణవ్‌ ఓకే చేశాడు

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు