స్టార్‌ డైరీ

8 Jan, 2021 00:09 IST|Sakshi

హీరోయిన్లు ఒకే సమయంలో నాలుగైదు సినిమాలు చేస్తుంటారు. ఆ సెట్‌ నుంచి ఈ సెట్‌కి.. ఈ సెట్‌ నుంచి ఆ సెట్‌కి వెళ్తూ బిజీబిజీగా ఉంటారు. లాక్‌డౌన్‌లో షూటింగ్స్‌ మాత్రమే ఆగిపోయాయి. కొత్త కథలు తయారవుతూనే ఉన్నాయి. కొత్త సినిమాలు కమిట్‌ అవుతూనే ఉన్నారు. ప్రస్తుతం హీరోయిన్ల చేతిలో ఎన్ని సినిమాలున్నాయి? సెట్స్‌లో ఉన్న, పూర్తయిన, విడుదలకు సిద్ధమైన చిత్రాలతో ఒక్కో స్టార్‌ డైరీ ఎలా ఉంది? ఓ లుక్కేద్దాం.

తమన్నా: వెంకటేశ్‌తో ‘ఎఫ్‌ 3’,  నితిన్‌తో ‘అంధా ధున్‌’ తెలుగు రీమేక్‌. గోపీచంద్‌తో ‘సీటీమార్‌’, సత్యదేవ్‌తో ‘గుర్తుందా శీతాకాలం’.

కాజల్‌ అగర్వాల్‌: చిరంజీవితో ‘ఆచార్య’, కమల్‌హాసన్‌తో ‘భారతీయుడు 2’, మంచు విష్ణుతో ‘మోసగాళ్ళు’, దుల్క ర్‌తో ‘హే సినామిక’ (పూర్తయింది), తమిళంలో రెండు హారర్‌–కామెడీ చిత్రాలు కమిటయ్యారు.

కీర్తీ సురేశ్‌: మహేశ్‌బాబుతో ‘సర్కారు వారి పాట’, రజనీకాంత్‌తో ‘అన్నాత్తే’,  నితిన్‌తో ‘రంగ్‌ దే’, నితిన్‌తో ‘పవర్‌ పేట’, ఆదితో ‘గుడ్‌ లక్‌ సఖీ’ (పూర్తయింది), తమిళంలో సెల్వ రాఘవన్‌తో ‘సాని కాయిదమ్‌’.

రకుల్‌ ప్రీత్‌ సింగ్‌: నితిన్‌తో ‘చెక్‌’ (పూర్తయింది). కమల్‌హాసన్‌తో ‘భారతీయుడు 2’, వైష్ణవ్‌ తేజ్‌తో ఓ సినిమా, హిందీలో ‘సర్దార్‌ అండ్‌ గ్రాండ్‌ సన్‌’, ‘మే డే’, ‘థ్యాంక్‌ గాడ్‌’. తమిళంలో శివకార్తికేయన్‌తో ‘అయలాన్‌’.

సాయి పల్లవి: రానాతో ‘విరాట పర్వం’, నాగచైతన్యతో ‘లవ్‌స్టోరీ’ (పూర్తయింది), నానీతో ‘శ్యామ్‌ సింగరాయ్‌’.

లావణ్యా త్రిపాఠి: సందీప్‌ కిషన్‌తో ‘ఏ1 ఎక్స్‌ప్రెస్‌’, కార్తికేయతో ‘చావు కబురు చల్లగా’.

శ్రుతీహాసన్‌:క్రాక్‌’ (రేపే విడుదల).

పవన్‌ కల్యాణ్‌తో ‘వకీల్‌ సాబ్‌’, తమిళంలో విజయ్‌ సేతుపతితో ‘లాభం’

నిత్యా మీనన్‌: సత్యదేవ్‌తో ‘స్కై ల్యాబ్‌’ చిత్రం, అశోక్‌ సెల్వన్‌తో ‘నిన్నిలా నిన్నిలా’, మలయాళంలో ‘కులంబీ’.

నిధీ అగర్వాల్‌: గల్లా అశోక్‌తో ఓ తెలుగు సినిమా, తమిళంలో శింబుతో ‘ఈశ్వరన్‌’, ‘జయం’ రవితో ‘భూమి’ సినిమాలు పూర్తయ్యాయి.

నివేదా థామస్‌: ‘వకీల్‌ సాబ్‌’, సుధీర్‌ వర్మ దర్శకత్వంలో ఓ లేడీ ఓరియంటెడ్‌ సినిమా.

సమంత: గుణశేఖర్‌ దర్శకత్వంలో ‘శాకుం తలం’, తమిళంలో విజయ్‌ సేతుపతితో ‘కాదువాక్కుల  రెండు కాదల్‌’ చేస్తున్నవి. అశ్విన్‌ శరవణన్‌ దర్శకత్వంలో ఓ తమిళ సినిమా కమిటయ్యారని టాక్‌.

రష్మికా మందన్నా:  అల్లు అర్జున్‌తో ‘పుష్ప’, శర్వానంద్‌తో ‘ఆడాళ్లు మీకు జోహార్లు’, కార్తీతో ‘సుల్తాన్‌’ (పూర్తయింది), హిందీలో సిద్ధార్థ్‌ మల్హోత్రాతో ’మిషన్‌ మజ్ను’, అమితాబ్‌తో ‘డెడ్లీ’. కన్నడంలో ‘పొగరు’ (పూర్తయింది).

పూజా హెగ్డే: ప్రభాస్‌తో ‘రాధే శ్యామ్‌’, అఖిల్‌తో ‘మోస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌’, దుల్కర్‌–హను రాఘవపూడి సినిమా, హిందీలో సల్మాన్‌ ఖాన్‌తో ‘కభీ ఈద్‌ కభీ దీపావళి’, రణ్‌వీర్‌తో ‘సర్కస్‌’.

రాశీ ఖన్నా: తమిళంలో విజయ్‌ సేతుపతితో ‘తుగ్లక్‌ దర్బార్‌’, ఆర్యతో ‘అరణ్‌మణై’. షాహిద్‌తో హిందీలో ఓ వెబ్‌ సిరీస్‌. తమిళంలో విక్రమ్‌తో ఓ సినిమా కమిటయ్యారట.

నయనతార: తమిళంలో రజనీకాంత్‌తో ‘అన్నాత్తే’,  విజయ్‌ సేతుపతితో ‘కాదువాక్కుల రెండు కాదల్, నెట్రిక్కన్‌’, మలయాళంలో ‘నిళల్, పాట్టు’.

రీతూ వర్మ: నానీతో ‘టక్‌ జగదీష్‌’, శర్వానంద్‌తో ఓ ద్విభాషా చిత్రం, నాగ శౌర్యతో ‘వరుడు కావలెను’, అశోక్‌ సెల్వన్‌తో ‘నిన్నిలా నిన్నిలా, తమిళంలో విక్రమ్‌తో ‘ధృవ నక్షత్రం’.

నభా నటేశ్‌: నితిన్‌తో ‘అంధా ధున్‌’ తెలుగు రీమేక్, ‘అల్లుడు అదుర్స్‌’ (సంక్రాంతికి విడుదల కానుంది).

పాయల్‌ రాజ్‌పుత్‌: తెలుగులో లేడీ ఓరియంటెడ్‌ ‘5డబ్ల్యూస్‌’, తమిళంలో ‘ఏంజెల్‌’.

ప్రియమణి: ‘నారప్ప, కొటేషన్‌ గ్యాంగ్‌’. 

అంజలి: పవన్‌ కల్యాణ్‌ ‘వకీల్‌ సాబ్‌’.

రెజీనా: విశాల్‌తో ‘చక్ర’, ‘నేనేనా’, అరవింద్‌ స్వామితో ‘కల్లాపాట్‌’.

అదితీ రావ్‌ హైదరీ: శర్వానంద్‌తో ‘మహా సముద్రం’, తమిళంలో దుల్కర్‌ సల్మాన్‌తో ‘హే సినామిక’ (పూర్తయింది), హిందీలో ‘సర్దార్‌ అండ్‌ గ్రాండ్‌ సన్‌’.

అనుపమా పరమేశ్వరన్‌: నిఖిల్‌తో ‘18 పేజెస్‌’ మెహరీన్‌: ‘ఎఫ్‌ 3’.

నివేదా పేతురాజ్‌: సాయిధరమ్‌–దేవా కట్టా సినిమా.

ఈషా రెబ్బా: ‘మోస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌’, తమిళ సినిమా ‘ఆయిరమ్‌ జన్మంగళ్‌’.

శ్రద్ధా శ్రీనాథ్‌: సిద్ధు జొన్నలగడ్డతో ‘నరుడి బ్రతుకు నటన’, విశాల్‌తో ‘చక్ర’ (పూర్తయింది)

ఐశ్వర్యా రాజేష్‌:  నానీతో ‘టక్‌ జగదీష్‌’.

మరిన్ని వార్తలు