ప్రభాస్‌తో తలపడనున్న కన్నడ నటుడు!

7 Feb, 2021 14:44 IST|Sakshi

పాన్‌ ఇండియా స్టార్‌ ప్రభాస్‌, కేజీఎఫ్‌ డైరెక్టర్‌ ప్రశాంత్‌ నీల్‌ కాంబినేషన్‌లో వస్తున్న క్రేజీ చిత్రం "సలార్"‌. శృతి హాసన్‌ కథానాయికగా నటిస్తోంది. ఈ సినిమాలో తమిళ నటుడు విజయ్‌ సేతుపతి విలన్‌గా చేయనున్నారని అప్పట్లో ఫిలింనగర్‌లో పుకార్లు వ్యాపించాయి. కానీ దీనిపై నటుడు గానీ, అటు చిత్రయూనిట్‌ గానీ ఎటువంటి అధికారిక ప్రకటన చేయలేదు. దీంతో ఇది వుట్టి పుకారుగానే మిగిలిపోయింది. తాజాగా ఇందులో విలన్‌గా మరో పేరు ప్రచారంలోకి వచ్చింది. తమిళ నటుడు మధు గురుస్వామి హీరోతో తలపడుతాన్న వార్త టాక్‌ ఆఫ్‌ ద టౌన్‌గా మారింది.

సలార్‌ సినిమాలో భాగమవుతున్న విషయాన్ని ఆయనే స్వయంగా సోషల్‌ మీడియాలో వెల్లడించాడు. సలార్‌లో పని చేస్తుండటం సంతోషంగా ఉందంటూనే తనకీ అవకాశం కల్పించిన దర్శకనిర్మాతలకు కృతజ్ఞతలు తెలిపాడు. కాగా ఏ హర్హ దర్శకత్వం వహించిన 'వజ్రకాయ' సినిమాతో గురుస్వామి పాపులారిటీ సంపాదించుకున్నాడు. ఈ చిత్రం తెచ్చిన గుర్తింపుతో కన్నడతో పాటు పలు దక్షిణాది భాషల్లోనూ నటించి ఆకట్టుకున్నాడు. అయితే ఈసారి ఏకంగా పాన్‌ ఇండియా సినిమాలో నటించే అవకాశాన్ని కొట్టేశాడు. సలార్‌ చిత్రానికి పలువురు కన్నడ సాంకేతిక నిపుణులు పని చేస్తున్న విషయం తెలిసిందే. దర్శకుడు ప్రశాంత్‌ నీల్‌ సహా సినిమాటోగ్రఫీ భువన్‌గౌడ, కంపోజ్‌ రవి బర్సూర్‌ అందరూ కన్నడిగులే.

ఇక ఈ మధ్యే 'సలార్'‌ షూటింగ్‌ రామగుండంలో ప్రారంభమైన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఫిబ్రవరి 2న గోదావరిఖనిలోని శ్రీనగర్‌ వద్ద టీమ్‌ సభ్యులు ప్రయాణిస్తున్న వాహనం ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో పలువురు యూనిట్‌ సభ్యులకు స్వల్ప గాయాలయ్యాయి. ఇక అదే రోజు ముంబైలోని గోరేగాన్‌ స్టూడియోలో వేసిన 'ఆదిపురుష్'‌ సెట్‌లోనూ అగ్ని ప్రమాదం సంభవించిన విషయం తెలిసిందే.

చదవండి: సలార్‌‌ షూటింగ్: ప్రాణాలను పణంగా పెట్టిన అభిమానం

చదవండి: సలార్‌ : శృతి హాసన్‌కు భారీ రెమ్యునరేషన్‌!

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు