బొగ్గు గనిలో వాలిపోనున్న ‘సలార్‌’ టీమ్‌

27 Jan, 2021 11:54 IST|Sakshi

సింగరేణి గడ్డపై ‘సలార్‌’ షూటింగ్‌

రామగుండం‌: ప్రభాస్‌ హీరోగా ‘సలార్‌' సినిమా రూపుదిద్దుకుంటున్న సంగతి తెలిసిందే. కన్నడ దర్శకుడు ప్రశాంత్‌ నీల్‌ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాలో ఓ ఫైటింగ్‌ సన్నివేశాన్ని రామగుండం-3 పరిధిలోని సింగరేణి ఓసీపీ-2లో చిత్రీకరించనున్నారు. సింగరేణి ఓపెన్‌ కాస్ట్‌ ప్రాంతంలో త్వరలో సినీ నటుడు ప్రభాస్‌, ఇతర చిత్రబృందం వాలిపోనుంది. బొగ్గుగని ప్రాంతంలో ఫైట్‌ సీన్లు తెరకెక్కించనున్నారు. ఈ మేరకు ఓపెన్‌కాస్ట్‌ ప్రాంతంలో ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి.  తాజాగా చిత్ర బృందం ఆర్జీ 3 పరిధిలోని ఓసీపీ-2 ప్రాజెక్టు వద్ద సెట్టింగ్‌ పనులు మొదలుపెట్టారు.

సెట్టింగ్‌ పనులు పూర్తవగానే నటీనటులు, చిత్రబృందం రానుంది. రెండు, మూడు రోజుల్లో సెట్టింగ్‌ పూర్తయి సినిమా షూటింగ్‌ ప్రారంభమవుతుందని చిత్ర బృందంలోని ఒకరు చెప్పారు. పది రోజుల పాటు ఓపెన్‌ కాస్ట్‌ గనిలో షూటింగ్‌ జరగనున్నట్టు తెలుస్తోంది. అయితే చిత్ర బృందానికి సింగరేణి అతిథి గృహాలను కేటాయించినట్లు సమాచారం. హోంబలే ఫిలింస్‌ బ్యానర్‌పై విజయ్‌ కిరంగందూరు నిర్మాణంలో రూపొందుతున్నఈ మూవీకి సినిమాటోగ్రఫీ భువన్‌ గౌడ, సంగీతం రవి బస్రూర్‌ అందిస్తున్నారు. దీనితోపాటు ప్రభాస్‌ ‘రాధేశ్యామ్’, ‘ఆదిపురుష్’ సినిమాలు చేస్తున్నాడు.

మీ అభిప్రాయాలను కింద తెలపండి

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments

మరిన్ని వార్తలు