Salaar Movie Ugramm Remake Rumours: ఆ సినిమాకు రీమేక్‌నే సలార్‌.. మ్యూజిక్‌ డైరెక్టర్‌ వ్యాఖ్యలు వైరల్‌

2 Oct, 2023 08:21 IST|Sakshi

 ప్రభాస్‌ ఫ్యాన్స్‌ ఎంతగానో ఎదురుచూస్తున్న సినిమా ‘సలార్‌’. ‘కేజీఎఫ్‌’ లాంటి బ్లాక్‌ బస్టర్‌ను అందించిన ప్రశాంత్‌ నీల్‌ దర్శకత్వంలో రానున్న ఈ చిత్రంపై ఇప్పటికే భారీగా అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమాలో ప్రభాస్‌ సరసన శృతి హాసన్‌ నటిస్తోంది. అలాగే ‘పొగరు’ సినిమాలో విలన్‌గా మంచి గుర్తింపు తెచ్చుకున్న శ్రియా రెడ్డి ఈ సినిమాలో కీలకపాత్ర పోషించిన సంగతి తెలిసిందే. ఈ భారీ యాక్షన్ సినిమా డిసెంబంర్‌ 22న థియేటర్లలోకి రానుంది.

(ఇదీ చదవండి: బిగ్‌బాస్‌లోకి ఎంట్రీ ఇచ్చిన సౌండ్‌ బోట్‌ బ్యూటీ)

అయితే గతంలో ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన ఉగ్రం సినిమాకు సలార్‌ రీమేక్ అని వార్తలు వచ్చాయి. అయితే దీనిపై ఈ చిత్ర మ్యూజిక్ డైరెక్టర్ రవి బస్రూర్ మాట్లాడిన మాటలు నెట్టింట్లో వైరల్​గా మారాయి. సలార్‌ విడుదల తేదీ ప్రకటించడంతో ఇలాంటి రూమర్స్‌కు ఇక కొదవలేదు. ఈ నేపథ్యంలో ఎన్నో నెలల క్రితం సంగీత దర్శకుడు రవి బస్రూర్ సలార్ సినిమా గురించి మాట్లాడిన వీడియో ఒకటి మళ్లీ సోషల్‌మీడియాలో ట్రెండింగ్ అవుతుంది. ఆ వీడియోలో ఆయన ఇలా చెప్పాడు. ' డైరెక్టర్​ ప్రశాంత్ నీల్ మొదటి సినిమా ఉగ్రమ్​కు.. సలార్​ రీమేక్​ అని అందులో ఆయన ఆయన చెప్పారు.

ఆ వీడియోలో ఆయన ఏ ఉద్దేశంతో చెప్పారో క్లారిటీ లేదు. కానీ ఉగ్రం సినిమా చూసిన వారికి మూవీ లైన్​ను సరిచూస్తే  కొంతమేరకు సంబంధం ఉన్నట్లు కనిపిస్తోంది. కానీ ఇందులో నిజం ఉండదని పలువురు కామెంట్లు చేస్తున్నారు. కన్నడలో ఉగ్రం సినిమా భారీ హిట్‌ క్టొటింది. మళ్లీ ఇదే సినిమాను రీమేక్‌గా ప్రశాంత్‌ నీల్‌ ఎందుకు తీస్తాడని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. యూట్యూబ్‌లో ఉన్న ఉగ్రం సినిమాకు 50 మిలియన్లకు పైగానే వ్యూస్‌ వచ్చాయి. ఎవరో కావాలనే ప్రభాస్‌ సినిమాపై ఇలాంటి తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని ఆయన ఫ్యాన్స్‌ ఫైర్‌ అవుతున్నారు.

మరిన్ని వార్తలు