Salaar Movie: 'సలార్' ట్రైలర్ కౌంట్‌డౌన్.. నిర్మాణ సంస్థ ఇంట్రెస్టింగ్ ట్వీట్

30 Nov, 2023 16:22 IST|Sakshi

'సలార్' ట్రైలర్ వచ్చేందుకు కౌంట్‌డౌన్ మొదలైపోయింది. యూట్యూబ్‌లో విడుదల కావడానికి మరికొన్ని గంటలు మాత్రమే సమయముంది.  ఓవైపు ఫ్యాన్స్ తెగ ఎగ్జైట్ అయిపోతున్నారు. సరిగ్గా ఇలాంటి టైంలో చిత్ర నిర్మాణ సంస్థ హోంబలే ఫిల్మ్స్ ఇంట్రెస్టింగ్ ట్వీట్ చేసింది. 'సలార్' మూవీ టికెట్స్ ఉచితంగా ఇస్తామని ఆఫర్ ప్రకటించింది. కాకపోతే ఓ కండీషన్ పెట్టింది.

ట్రైలర్ సంగతేంటి?
డార్లింగ్ ప్రభాస్.. చాలా ఏళ్ల తర్వాత పూర్తిస్థాయిలో చేస్తున్న యాక్షన్ సినిమా 'సలార్'. 'కేజీఎఫ్' ఫేమ్ ప్రశాంత్ నీల్ దర్శకుడు కావడంతో అంచనాలు గట్టిగానే ఉన్నాయి. కాకపోతే రిలీజ్ ఎప్పటికప్పుడు వాయిదా పడుతూ వచ్చేసరికి ఫ్యాన్స్ డిసప్పాయింట్ అయ్యారు కానీ ఓవరాల్‌గా సినిమాపై ఎక్స్‌పెక్టేషన్స్ గట్టిగానే ఉన్నాయి. ఈ క్రమంలోనే డిసెంబరు 1న సాయంత్రం 7:19 గంటలకు ట్రైలర్ రిలీజ్ చేస్తామని కొన్నిరోజుల క్రితమే ప్రకటించారు.

(ఇదీ చదవండి: థియేటర్లలో కాకుండా నేరుగా ఓటీటీలోకి వచ్చేసిన తెలుగు మూవీ)

ఉచితంగా టికెట్స్
ఇక ట్రైలర్ విడుదలకు ఓ రోజు ముందు అంటే.. గురువారం మధ్యాహ్నం 'సలార్' నిర్మాణ సంస్థ హోంబలే ఫిల్మ్స్ ప్రభాస్-ప్రశాంత్ నీల్ ఫొటో ఒకటి ట్విట్టర్ పోస్ట్ చేసింది. దీనికి మంచి క్యాప్షన్ చెప్పిన ఓ ఐదుగురికి.. వాళ్ల ఏరియాలోని ఓ థియేటర్‌లో ఫస్ట్ డే ఫస్ట్ షో టికెట్, మూవీ పేరున్న టీ-షర్ట్‌ని ఉచితంగా ఇస్తామని ప్రకటించింది. మరి ఇందులో గెలిచే ఆ లక్కీ విన్నర్ ఎవరో చూడాలి?

సినిమా రిలీజ్
ప్రస్తుతం 'సలార్' పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. ప్రభాస్, శ్రుతిహాసన్, పృథ్వీరాజ్ సుకుమారన్ తదితరులు నటిస్తున్న ఈ సినిమాని డిసెంబరు 22న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో రిలీజ్ చేయనున్నారు. ఇద్దరు ఫ్రెండ్స్.. బద్ద శత్రువుల కావడం అనే స్టోరీతో 'సలార్' తీసినట్లు ఇటీవలే ఓ ఇంటర్వ్యూలో డైరెక్టర్ ప్రశాంత్ నీల్ చెప్పాడు.

(ఇదీ చదవండి: ఇంట్లో పనిమనిషికి ఆ సాయం చేసిన స్టార్ హీరో అల్లు అర్జున్)

మరిన్ని వార్తలు