చిరు కోసం సల్మాన్‌.. ప్రభాస్‌ కోసం అమితాబ్‌, డేట్స్ కన్‌ఫామ్‌ చేస్తున్న బాలీవుడ్‌ స్టార్స్‌

26 Aug, 2021 11:31 IST|Sakshi

కరోనా కాలంలో బాలీవుడ్ స్టార్స్ ,టాలీవుడ్ పై ఎక్కువగా ప్రేమ కురిపిస్తున్నారు.ఇప్పటికే ఆర్‌ఆర్‌ఆర్‌ చిత్రంలో అజయ్ దేవగన్ నటిస్తున్నాడు. అలాగే ఆదిపురుష్ లో సైఫ్ అలీ ఖాన్ కనిపించబోతున్నాడు.సైరాలో అమితాబ్ అతిథి పాత్ర చేశారు.నాగ్ అశ్విన్ కొత్త చిత్రంలో పూర్తి స్థాయి పాత్ర ను చేయబోతున్నారు. ఇక తాజాగా చిరంజీవి చిత్రంలో సల్మాన్‌ ఖాన్‌ నటించబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. మొన్నటి వరకు ఈ కాంబో గురించి టాలీవుడ్ లో మాత్రమే డిస్కషన్ జరిగింది. కానీ, ఇప్పుడు బీటౌన్ లో కూడా ఈ మెగా కాంబో గురించి డిస్కషన్ జరుగుతోంది.బిగ్ బాస్ నటిస్తున్న మలయాళ లూసిఫర్ తెలుగు రీమేక్ గాఢ్ ఫాదర్ లో భాయ్ జాన్ ఎంట్రీ ఆల్ మోస్ట్ కన్ ఫామ్ అయిపోయింది.
(చదవండి: డ్రగ్స్‌ కేసు: ఆస్పత్రిలో చేరిన హీరోయిన్‌ సంజన)

గాడ్ ఫాదర్ ప్రాజెక్ట్ ను పాన్ ఇండియా ప్రాజెక్ట్ గా మార్చేస్తున్నాడు మోహన్ రాజా.సల్మాన్ ఖాన్ ఎంట్రీతో ఈ ప్రాజెక్ట్ రూపురేఖలు మొత్తం మారిపోయాయి.మలయాళంలో పృథ్విరాజ్ చేసిన క్యారెక్టర్ ను,ఇప్పుడు సల్మాన్ ఖాన్ చేయనున్నాడు.హై వోల్డేట్ యాక్షన్ సీన్స్ తో దబంగ్ ఖాన్ తెలుగు సినిమాలో దుమ్మురేపనున్నాడు.

కేవలం చిరుపై ఉన్న అభిమానంతో,తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యేందుకు వచ్చిన అవకాశంగా,గాడ్ ఫాదర్ లో నటించేందుకు సల్మాన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట.ప్రస్తుతం టైగర్ 3 షూట్ కోసం రష్యా లో బిజీగా ఉన్నాడు సల్మాన్.అక్కడి నుంచి తిరిగి వచ్చిన తర్వాత సల్మాన్, చిరు కాంబినేషన్స్ లో యాక్షన్ సీన్స్ చిత్రీకరించున్నాడట మోహన్ రాజా.

మరిన్ని వార్తలు