వచ్చే వారమే బిగ్‌బాస్‌ ఫినాలే?!

28 Nov, 2020 17:53 IST|Sakshi

వైరలవుతోన్న బిగ్‌బాస్‌ 14 ప్రోమో

బిగ్‌బాస్‌ అంటేనే ట్విస్టులు, షాక్‌లు సర్వసాధారణం. అవి లేకపోతే షో చప్పగా ఉంటుంది. ఎన్ని ట్విస్ట్‌లు ఉంటే షో అంత రక్తి కడుతుంది. హిందీ బిగ్‌బాస్‌లో ఈ ట్విస్ట్‌లు, డ్రామా కొంచెం ఎక్కువగా ఉంటాయి. ఈ నేపథ్యంలో హిందీ బిగ్‌బాస్‌ 14కి సంబంధించి ఓ షాకింగ్‌ న్యూస్‌ ప్రస్తుతం హల్‌చల్‌ చేస్తుంది. మామూలుగా ఈ షో ఫినాలే జనవరి ఫస్ట్‌ వారంలో ఉంది. కానీ వచ్చే వారమే బిగ్‌బాస్‌ ఫినాలే ఉండబోతుంది అంటూ షో హోస్ట్‌ సల్మాన్‌ ఖాన్‌ బాంబ్‌ వేశారు. అంతేకాదు కేవలం నలుగురు మాత్రమే ఫినాలేలో ఉండబోతున్నారని తెలిపారు. ఈ షాకింగ్‌ కామెంట్స్‌ నేటి వీకెండ్‌ ఎపిసోడ్‌లో వెలువడనున్నాయి. ఇక నేటి ఎపిసోడ్‌కు సంబంధించిన ప్రోమో ప్రస్తుతం తెగ వైరలవుతోంది. దీనిలో సల్మాన్‌ వచ్చేవారమే ఫినాలే ఉండబోతుందని తెలిపి షాక్‌ ఇచ్చారు. (చదవండి: బిగ్‌బాస్‌ బిగ్‌ షాక్‌.. ఇక అందరూ ఎలిమినేషన్‌లోనే!)

ప్రోమోలో ఉన్న దాని ప్రకారం సల్మాన్‌, బిగ్‌బాస్‌ 14 ఫినాలే ఎప్పుడు ఉండనుందో గెస్‌ చేయాల్సిందిగా హౌజ్‌మెట్స్‌ని కోరారు. దానికి వారు జనవరి ఫస్ట్‌ వారం బిగ్‌బాస్‌ 14 ఫినాలే వీకెండ్‌ అని తెలిపారు. అందుకు సల్మాన్‌ ‘మీకు అలా అనిపిస్తుందా.. ఇప్పుడు సీన్‌ రివర్స్‌ అయ్యింది. మీరనుకున్నట్లు జనవరి మొదటి వారం ఫినాలే వీకెండ్. కానీ కాదు. వచ్చ వారమే ఫినాలే ఉండనుంది. కేవలం నలుగురు మాత్రమే ఫైనల్‌కు వెళ్లనున్నారు’ అని తెలిపారు. అసలు సల్మాన్‌ ఇలా ఎందుకు అన్నాడు.. నిజంగా వచ్చే వారమే ఫినాలే వీకెండ్‌ కానుందా వంటి వివరాలు తెలియాలంటే ఇవాళ్టి ఎపిసోడ్‌లో చూడాల్సిందే.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు