సల్మాన్‌, రణ్‌దీప్‌ల మధ్య ఉండే స్మోక్‌ ఫైట్‌ హైలైట్‌

14 Mar, 2021 06:41 IST|Sakshi

సల్మాన్‌ ఖాన్‌  హీరోగా నటించిన ‘రాధే: యువర్‌ మోస్ట్‌ వాంటెడ్‌ భాయ్‌’ సినిమా విడుదల తేదీ ఖరారైంది. మే 13న ఈ చిత్రం విడుదల కానుంది. ప్రభుదేవా దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో రణ్‌దీప్‌ హుడా, దిశా పటానీ, జాకీ ష్రాఫ్, జరీనా వహాబ్‌ కీలక పాత్రలు చేశారు. ‘‘సల్మాన్‌ ఖాన్‌  నటించిన ‘వాంటెడ్‌’, ‘దబాంగ్‌’, ‘బాడీగార్డ్‌’ వంటి చిత్రాలు రంజాన్‌కు విడుదలై సూపర్‌హిట్‌ సాధించాయి. ఆ సెంటిమెంట్‌ను కంటిన్యూ చేస్తూ ఈ సినిమా కూడా హిట్‌ సాధిస్తుందనే నమ్మకం ఉంది.

ఈ సినిమాలో సల్మాన్‌, రణ్‌దీప్‌ల మధ్య ఉండే స్మోక్‌ ఫైట్‌ హైలైట్‌. ఈ ఫైట్‌ను ఓ కొరియన్‌ స్టంట్‌ టీమ్‌ డిజైన్‌  చేసింది. సల్మాన్‌  ఫ్యాన్స్‌కు ఈ చిత్రం ఓ యాక్షన్‌ ట్రీట్‌’’ అని చిత్రబృందం పేర్కొంది. నిజానికి ఈ సినిమా 2020 ఈద్‌కు విడుదల కావాల్సింది. కానీ కరోనాతో వాయిదా పడింది. ఆ తర్వాత ఓటీటీ ప్లాట్‌ఫామ్‌కు ఇచ్చేశారు. కానీ డిస్ట్రిబ్యూటర్స్, థియేటర్స్‌ ఓనర్ల అభ్యర్థనల మేరకు సల్మాన్‌  ఓటీటీ నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నారు. మరో రెండు నెలల్లో సల్మాన్‌  సినిమా థియేటర్స్‌లోకి వస్తుండడంతో అభిమానులు ఫుల్‌ ఖుషీలో ఉన్నారు.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు