Sanjay Dutt: సల్మాన్‌ స్పెషల్‌ విషెస్‌

29 Jul, 2021 17:54 IST|Sakshi

హ్యాపీ బర్త్‌డే బాబా  : సల్మాన్‌ ఖాన్‌

సాక్షి, ముంబై: బాలీవుడ్‌ హీరో సంజయ్ దత్‌  62వ పుట్టిన రోజు సందర్భంగా  అటు ఫ్యాన్స్‌, స్నేహితులు,ఇటు కుటుంబ సభ్యులనుంచి సోషల్‌ మీడియాలో  శుభాకాంక్షల వెల్లువ  కురుస్తోంది.  ముఖ్యంగా  బాలీవుడ్‌ కండల వీరుడు  సల్మాన్‌ ఖాన్‌ ఒక చక్కటి ఫోటోతో సంజయ్‌కు విషెస్‌ అందించారు. ఇపుడా ఫోటో ఫ్యాన్స్‌ను విపరీతంగా ఆకట్టు కుంటోంది. బాలీవుడ్‌ లివింగ్‌ లెజెండ్స్‌ అంటూ  అభిమానులు కామెంట్‌ చేశారు.

సల్మాన్‌, సంజయ్‌ జంటగా నటించిన దస్‌ చిత్రంలోని ‘సునో గౌర్ సే దునియా వాలో’ పాటలోని ఒక స్టిల్‌ను సోషల్‌ మీడియిలో షేర్‌ చేశారు. హ్యాపీ బర్త్‌డే బాబా అంటూ త్రోబ్యాక్ ఫోటోను ఇన్‌స్టాలో పోస్ట్‌ చేశారు. పాత జ్ఞాపకాలను తలచుకుంటూ తన ప్రియమైన స్నేహితుడు సంజూబాబాకి ప్రత్యేక శుభాకాంక్షలు అందించారు.  దీనికి సంజయ్ దత్ భార్య మాన్యతాతో పాటు పలువురు స్పందించారు.  కాగా సల్మాన్ ఖాన్, సంజయ్ దత్ సాజన్, చల్ మేరే భాయ్ లాంటి చిత్రాల్లో కలిసి నటించారు.  అలాగే సంజయ్ దత్  2012 చిత్రం సన్ ఆఫ్ సర్దార్ లోని పో పో పాటలో సల్మాన్ ఖాన్ నటించారు.

కాగా సంజయ్ దత్ పుట్టినరోజు సందర్భంగా  ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో  రూపొందుతున్న 'కేజీఎఫ్ 2' సినిమాలోని  సంజయ్‌ లుక్ కి సంబంధించిన స్పెషల్ పోస్టర్‌ను చిత్ర యూనిట్‌ రిలీజ్ చేసింది. ఈ సినిమాలో సంజయ్ దత్ అధీర అనే విలన్ పాత్రలో కనిపించబోతున్న సంగతి తెలిసిందే.

A post shared by Salman Khan (@beingsalmankhan)

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు