Salman Khan: పామును అవతల పారేద్దామనుకున్నా, ఇంతలో అది నాపై..

27 Dec, 2021 11:20 IST|Sakshi

Salman Khan Opens Up on Getting Bit by Snake: బాలీవుడ్‌ భాయ్‌జాన్‌ సల్మాన్‌ ఖాన్‌ బర్త్‌డే నేడు(డిసెంబర్‌ 27). దుదరృష్టవశాత్తూ బర్త్‌డేకు ఒకరోజుముందు సల్మాన్‌ పాముకాటుకు గురయ్యాడు. వెంటనే అతడికి ఆస్పత్రికి తరలించగా చికిత్స అందించిన వైద్యులు ఆయన ఆరోగ్యానికి ఎలాంటి హాని లేదని చెప్పడంతో అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. (Salman Khan 56th birthday: సల్లూ భాయ్‌కి హ్యాపీ బర్త్‌డే)

తాజాగా జరిగిన ఘటన గురించి సల్మాన్‌ మీడియా ముందు చెప్పుకొచ్చాడు. 'ఒక పాము నా ఫామ్‌హౌస్‌లోకి వచ్చింది. ఒక కట్టెతో దాన్ని అవతలకు పారేయాలనుకున్నా. కానీ అది వెంటనే నా చేతిపైకి పాకింది. దాన్ని కిందపడేసేలోపే మూడుసార్లు నన్ను కాటేసింది. అది ఒకరకమైన విషపూరిత పాము అనిపించింది. ఆసుపత్రిలో ఆరు గంటలు ఉన్న తర్వాత నన్ను డిశ్చార్జ్‌ చేశారు. ప్రస్తుతం బాగానే ఉన్నాను' అని చెప్పుకొచ్చాడు.

సల్మాన్‌ తండ్రి మాట్లాడుతూ.. 'నా కొడుక్కి పాము కాటేసిందనగానే ఎంతగానో భయపడిపోయాం. కానీ అది మరీ విషసర్పం కాకపోవడంతో త్వరగానే కోలుకున్నాడు. ఆస్పత్రికి వెళ్లి వచ్చిన తర్వాత రెస్ట్‌ తీసుకున్నాడు. అతడు ఆరోగ్యంగానే ఉన్నాడు. భయపడాల్సిన పనేమీ లేదు' అని పేర్కొన్నాడు. ఇదిలా ఉంటే సల్మాన్‌ చివరగా 'అంతిమ్‌: ద ఫైనల్‌ ట్రూత్‌' సినిమాలో కనిపించాడు.

మరిన్ని వార్తలు