సల్మాన్‌ఖాన్‌ సంచలనం.. రూ.1000 కోట్ల రెమ్యునరేషన్‌

17 Jul, 2022 15:16 IST|Sakshi

బిగ్ స్క్రీన్ పైనే కాదు స్మాల్ స్క్రీన్ పైనా , సల్మాన్ ఖాన్ కింగ్ గా వెలుగుతున్నాడు. 13 ఏళ్లుగా బుల్లితెరపై బిగ్‌బాస్‌ హిందీ వర్షన్ ను హోస్ట్ చేస్తూ వస్తున్నాడు సల్మాన్. ఓ విధంగా చెప్పుకోవాలంటే ఉత్తరాదిన బిగ్ బాస్ అంటే సల్మాన్ ఖాన్,సల్మాన్ అంటే బిగ్ బాస్. అందుకే సీజన్ సీజన్ కు రెమ్యూనరేషన్ ను పెంచుతూ వెళ్తున్నాడు.

నిజానికి ప్రతీ ఏడాది ఇదే చివరి సీజన్ అనుకుంటూ బిగ్ బాస్ ను హోస్ట్ చేస్తూ వస్తున్నాడు సల్మాన్ ఖాన్. అయితే ఈ షో నిర్వాహకులు ప్రతీసారి పారితోషికం పెంచుతూ సల్మాన్ డేట్స్ లాక్ చేస్తూ వస్తున్నారు. బిగ్ బాస్ 15ను హోస్ట్ చేసినందుకు సల్మాన్ ఖాన్ 350 కోట్లు అందుకున్నాడట.

(చదవండి: మళ్లీ పొట్టి దుస్తుల్లో రష్మిక పాట్లు.. వీడియో వైరల్‌)

త్వరలో బిగ్ బాస్ 16 మొదలు కానుంది. దీనికి కూడా సల్మాన్‌నే హోస్ట్‌గా చేయమని నిర్వాహకులు కోరారట. అయితే సల్మాన్‌ మాత్రం వెనుకడుగు వేశాడట. దీంతో నిర్వాహకులు భారీ రెమ్యునరేషన్‌ ఆఫర్‌ చేశారట.సీజన్ 16 హోస్ట్ చేస్తే దాదాపు వెయ్యి కోట్లు ఇస్తామంటున్నారట. ఇదే నిజమైతే మాత్రం ఇండియన్ టెలివిజన్ హిస్టరీలో సల్మాన్ ఖాన్ సెన్సేషన్ క్రియేట్ చేసినట్లే లెక్క.

మరిన్ని వార్తలు