షారుక్‌ ఖాన్‌ సినిమాలో సల్మాన్‌!

14 Feb, 2021 14:16 IST|Sakshi

మల్టీస్టారర్‌ చిత్రాన్ని ఎవరు వద్దనుకుంటారు? అందులోనూ బాలీవుడ్‌ హీరోలు సల్మాన్‌ ఖాన్‌, షారుక్‌ ఖాన్‌ ఒకే ఫ్రేములో కనిపిస్తే చూపు తిప్పుకోగలమా? ఛాన్సే లేదు కదా! గత కొద్ది రోజులుగా వీరిద్దరూ కలిసి నటిస్తున్నారంటూ బోలెడు వార్తలు బీటౌన్‌లో షికార్లు చేస్తున్న విషయం తెలిసిందే. తాజాగా వీటన్నింటికీ క్లారిటీ వచ్చేసింది. సల్మాన్‌ ఖాన్‌ తను వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న హిందీ బిగ్‌బాస్‌ షోలో ఎట్టకేలకు అసలు విషయం లీక్‌ చేశాడు. బిగ్‌బాస్‌ 14వ సీజన్‌ పూర్తైన వెంటనే యాక్షన్‌ థ్రిల్లర్‌ పఠాన్‌ సెట్స్‌లో కాలు మోపనున్నట్లు వెల్లడించారు. అంటే పఠాన్‌లో సల్మాన్‌ కీలక పాత్రలో కనిపించనున్నాడన్నమాట. శనివారం నాటి బిగ్‌బాస్‌ షోలో ఈ కండల వీరుడు మాట్లాడుతూ.. "ఈ షో పూర్తైన వెంటనే పఠాన్‌, తర్వాత టైగర్‌ 3, ఆ తర్వాత కబీ ఈద్‌ కబీ దివాళి సినిమా షూటింగ్‌లో పాల్గొంటాను. అవన్నీ పూర్తయ్యాక, ఎనిమిది నెలలు గడిచే లోపు బిగ్‌బాస్‌ 15వ సీజన్‌తో తిరిగి వస్తాం" అని చెప్పుకొచ్చాడు.

కాగా రెండేళ్ల గ్యాప్‌ తర్వాత షారుక్‌ నటిస్తున్న 'పఠాన్‌' చిత్రం దుబాయ్‌లో చిత్రీకరణ జరుపుకుంటోంది. ఇందులో హీరో పూర్తిస్థాయి యాక్షన్‌ అవతార్‌లో కనిపించనున్నాడట. ప్రపంచంలోనే ఎత్తైన బుర్జ్‌ ఖలీఫా మీద నుంచి గెంతడం లాంటి సాహస ఫీట్లు ఉంటాయని సమాచారం. సిద్దార్థ్‌ ఆనంద్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని యశ్‌రాజ్‌ ఫిల్మ్స్‌ నిర్మిస్తోంది. ఇక సల్లూభాయ్‌, షారుక్‌ కలిసి నటించడం ఇదేమీ తొలిసారి కాదు. 'కరణ్‌ అర్జున్‌', 'హమ్‌ తుమ్హారే హై సనమ్‌', 'కుచ్‌ కుచ్‌ హోతా హై', 'హర్‌ దిల్‌జో ప్యార్‌ కరేగా' సహా పలు సినిమాల్లో కలిసి నటించారు. చివరిసారిగా 2018లో వచ్చిన షారుక్‌ 'జీరో' చిత్రంలో సల్మాన్‌ స్పెషల్‌ గెస్ట్‌గా కనిపించాడు.

చదవండి: సల్మాన్‌ను పెళ్లి చేసుకునేందుకే వచ్చా: నటి

షారుఖ్‌ సెట్స్‌లో ఘర్షణ: చెంపదెబ్బల దాకా!?

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు