Salman Khan : సల్మాన్‌ఖాన్‌కు డెంగ్యూ.. బిగ్‌బాస్‌ హోస్ట్‌గా కరణ్‌ జోహార్‌

22 Oct, 2022 09:44 IST|Sakshi

బాలీవుడ్‌ కండలవీరుడు సల్మాన్‌ ఖాన్‌ డెంగ్యూ బారిన పడ్డాడు. కొన్నిరోజులుగా జ్వరంతో బాధపడుతున్న సల్మాన్‌ పరీక్షలు చేయించుకోగా డెంగ్యూ ఉన్నట్లు తేలింది. దీంతో రెండువారాల పాటు విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించారు. సల్మాన్‌కు డెంగ్యూ రావడంతో ఆయన నటిస్తున్న సినిమా షూటింగులు వాయిదాపడ్డాయి. ప్రస్తుతం ఆయన ‘కిసీ కా భాయ్, కిసీ కా జాన్’ అనే సినిమాల్లో నటిస్తున్నారు.

మరోవైపు బిగ్‌బాస్‌ సీజన్‌-16 ను సల్మాన్‌ హోస్ట్‌ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు ఆయన స్థానంలో కరణ్‌ జోహార్‌ కనిపించనున్నారు. దీంతో సల్మాన్‌  కోలుకునేవరకు బిగ్‌బాస్‌ సీజన్‌ను కరణ్‌ హోస్ట్‌ చేయనున్నాడు. ఇప్పటికే గతంలో కరణ్‌ బిగ్‌బాస్‌ ఓటీటీ సీజన్‌కు వ్యాఖ్యాతగా వ్యవహించిన సంగతి తెలిసిందే. 
 

మరిన్ని వార్తలు