Salman Khan:‘కాటమరాయుడు’ రీమేక్‌ని పక్కన పెట్టిన సల్మాన్‌, కారణం ఇదేనా?

16 Sep, 2021 10:41 IST|Sakshi

సౌత్ సైడ్ ఏదైనా మూవీ హిట్ అయితే చాలు. బాలీవుడ్ లో సల్మాన్ అలెర్ట్ అయిపోతాడు. వెంటనే రీమేక్ రైట్స్ కొనుగోలు చేస్తాడు. అలా సౌత్ లో సూపర్ హిట్టైన వీరమ్‌ మూవీని, గతంలోనే సల్మాన్ బాలీవుడ్ లోకి రీమేక్ చేయాలనుకున్నాడు. సీన్ కట్ చేస్తే ఇప్పుడు ఆ ఆలోచన విరమించుకున్నాడట. ఆ సౌత్ రీమేక్ ను పక్కన పెట్టాడట. 2014లో విడుదలైన వీరమ్‌ చిత్రం కోలీవుడ్‌ బాక్సాఫీస్‌ను షేక్‌ చేసింది. తమిళ స్టార్ హీరో అజిత్ ఊరమాస్ లుక్ కు కోలీవుడ్ ఆడియెన్స్ బ్రహ్మరథం పట్టారు. 80 కోట్లకు పైగా వసూళ్లను అందించారు. ఇదే చిత్రాన్ని తెలుగులో కాటమరాయుడు పేరుతో రీమేక్ అయింది. హిందీలో సల్మాన్ ఖాన్ కభీ ఈద్ కభీ దీవాళి పేరుతో రీమేక్ చేయాలనుకున్నాడు. పూజా హెగ్డే హీరోయిన్ గా నటించాల్సి ఉంది. కాని ఇప్పుడు ఈ రీమేక్ ఆగిపోయిందని బాలీవుడ్ లో జోరుగా ప్రచారం సాగుతోంది.

ఈ ఏడాది ఈద్ కానుకగా సల్మాన్ ఓటీటీలో రిలీజ్ చేసిన న్యూ మూవీ రాధే. ఈ సినిమా అనుకున్నంతగా అలరించలేకపోయింది. దాంతో సల్మాన్ షాక్ కు గురైయ్యాడని సమాచారం. తాను చేస్తున్న, చేయాల్సిన  ప్రాజెక్ట్స్ పై దృష్టి పెట్టాడట. అందులో భాగంగా అంతిమ్, టైగర్ 3 చిత్రాలు తప్పితే మిగితా ప్రాజెక్ట్స్ అన్నిటినీ  హోల్డ్ లో పెట్టాడట. కాటమరాయుడు హిందీ రీమేక్ ను క్యాన్సిల్ చేసాడట. ప్రస్తుతం సల్మాన్ చేయాల్సిన ప్రాజెక్ట్స్ లో మాస్టర్ రీమేక్, దబాంగ్ 4, కిక్ 2, చిత్రాలు ఉన్నాయి. మరి వీటి సంగతి ఏంటి అనేది కొద్ది రోజులు ఆగితే తెలుస్తోంది.

ఓటీటీలోకి మరో మూవీ
ఈద్ కానుకగా రాధే ను ఇటు ఓటీటీలోను, అటు థియేటర్స్ లోనూ ఒకేసారి రిలీజ్ చేసాడు సల్మాన్. ఇప్పుడు ఇదే ఫార్మాట్ లో అంతిమ్ కూడా విడుదల కానుందట. దేశంలో పూర్తిస్థాయిలో థియేటర్స్ తెరుచుకోకపోవడంతో, సింగిల్ స్క్రీన్స్, జీ5 యాప్ లో అంతిమ్ మూవీ ఒకేసారి విడుదల చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయట. ఈ మూవీలో సల్మాన్, ఆయన బావమరిది ఆయుష్ శర్మ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఇందులో గ్యాంగ్ స్టర్ రోల్ ను  ఆయుష్, అలాగే పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్ ను సల్మాన్ చేస్తున్నాడు.

మరిన్ని వార్తలు