Salman Khan : షూటింగ్‌లో గాయపడ్డ సల్మాన్‌ ఖాన్‌.. ఫోటో వైరల్‌

19 May, 2023 10:41 IST|Sakshi

బాలీవుడ్‌ స్టార్‌ హీరో సల్మాన్‌ ఖాన్‌ గాయపడ్డాడు. సినిమా షూటింగ్‌లో యాక్షన్‌ సన్నివేశాలు తెరకెక్కిస్తుండగా సల్మాన్‌ భుజానికి గాయమైంది. ఈ విషయాన్ని స్వయంగా సల్మాన్‌ తెలిపారు. ఎడమ భుజానికి గాయమైనట్లుత తెలుపుతూ ఓ ఫోటోను ట్విటర్‌లో పోస్ట్‌ చేశారు.దీంతో గెట్‌ వెల్‌ సూన్‌ అంటూ అభిమానులు కామెంట్స్‌ చేస్తున్నారు. కాగా ప్రస్తుతం సల్మాన్‌ ‘టైగర్-3’షూటింగ్‌లో నటిస్తున్న సంగతి తెలిసిందే.

గతంలో వచ్చిన ఏక్ థా టైగర్, టైగర్ జిందా హైకి సీక్వెల్‌గా రూపొందుతున్న ఈ సినిమా షూటింగ్‌ ఇప్పుడు శరవేగంగా కొనసాగుతుంది. ఈ మూవీలో సల్మాన్‌పై భారీ యాక్షన్‌ సీన్స్‌ను చిత్రీకరిస్తున్నారు. ఈ క్రమంలో అనుకోకుండా సల్మాన్‌ భుజానికి గాయమైంది. ఇక ఈ సినిమాలో షారుక్‌ ఖాన్‌ గెస్ట్‌ రోల్‌లో కనిపించనున్నారు. చదవండి: ఒకే ఫ్రేమ్‌లో రజనీకాంత్, కపిల్ దేవ్.. నెట్టింట ఫోటో వైరల్‌ 

అంతేకాకుండా వీరిద్దరి మధ్య ఓ యాక్షన్‌ సీన్‌ కూడా ఉండనుందట. ఇటీవలె కిసీకా భాయ్ కిసీకి జాన్‌తో ప్రేక్షకులను పలకరించిన సల్మాన్‌కు ఆ సినిమా నిరాశనే మిగిల్చింది. దీంతో టైగర్‌-3 కోసం బాగానే కసరత్తులు చేస్తున్నాడు ఈ కండల వీరుడు.  

మరిన్ని వార్తలు