అలా అయితే రూ.3000 కోట్లు వసూలు చెయ్యొచ్చు: సల్మాన్‌

2 Oct, 2022 07:42 IST|Sakshi

‘‘హిందీలో  ‘ప్రతిబం«ధ్‌’ (1990), ‘ఆజ్‌ కా గూండారాజ్‌’ (1992), ‘ది జెంటిల్‌ మేన్‌’ (1994) వంటి సినిమాలు చేశాను. ఆ తర్వాత తెలుగు సినిమాలతో బిజీ అయి, హిందీ సినిమాలకు దూరంగా ఉన్నాను. ప్రాంతీయ, జాతీయ సినిమాలు అనే తేడాలు పోవాలి. ఏ సినిమా అయినా ఇండియన్‌ సినిమాయే అనే రోజులు రావాలని కోరుకుంటున్నాను’’ అని చిరంజీవి అన్నారు. చిరంజీవి హీరోగా మోహన్‌రాజా దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘గాడ్‌ఫాదర్‌’. కొణిదెల సురేఖ సమర్పణలో ఆర్బీ చౌదరి, ఎన్వీ ప్రసాద్‌ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 5న విడుదల నుంది.

శనివారం ముంబైలో జరిగిన ఈ సినిమా హిందీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌లో చిరంజీవి మాట్లాడుతూ – ‘‘ఈ సినిమాలో నటించినందుకు నిర్మాతలు సల్మాన్‌కు పారితోషికం ఇవ్వాలనుకున్నప్పుడు ‘చిరంజీవిగారు, రామ్‌చరణ్‌లపై నాకు ఉన్న ప్రేమను ఈ చెక్‌తో వెలకడతారా?’’అని తిరస్కరించారు. ‘గాడ్‌ఫాదర్‌’ పార్టు 2 ఉండొచ్చు’’ అన్నారు.

సల్మాన్‌ ఖాన్‌ మాట్లాడుతూ – ‘‘గాడ్‌ఫాదర్‌’లో ఓ చిన్న రోల్‌ అన్నారు. చిరంజీవిగారు మీ వెనకాల నిలబడతారు అనగానే ఓకే అన్నాను. ‘గాడ్‌ఫాదర్‌’ తెలుగులో నా తొలి సినిమా. కొందరు హాలీవుడ్‌కు వెళ్లా లనుకుంటారు. నేను దక్షిణాదికి వెళ్లాలను కుంటున్నాను. నేను మల్టీస్టారర్‌ మూవీస్‌ చేయడానికి రెడీ. ఎందు కంటే మేం సోలో హీరోగా చేస్తే ఆ సినిమా మూడు వందల కోట్లు సాధిస్తోంది. అదే స్టార్స్‌ కలిసి చేస్తే మూడువేల కోట్లు కూడా సాధించే చాన్స్‌ ఉంది’’ అన్నారు. 

మరిన్ని వార్తలు