Sidharth Shukla: సిద్దార్థ్‌ను దేవుడు కాపాడలేడంటూ సల్మాన్‌ జోక్‌!

3 Sep, 2021 21:33 IST|Sakshi

Salman Khan: బాలీవుడ్‌ యువ నటుడు సిద్దార్థ్‌ శుక్లా సెప్టెంబర్‌ 2న గుండెపోటుతో మరణించిన విషయం తెలిసిందే. ఆయన మరణవార్త విని అభిమానులు, సెలబ్రిటీలు శోకసంద్రంలో మునిగిపోయారు. అతడి ఆత్మకు శాంతి కలగాలంటూ సోషల్‌ మీడియాలో నివాళులు అర్పిస్తున్నారు. ఇదిలా వుంటే హిందీ బిగ్‌బాస్‌ 13వ సీజన్‌లో పాల్గొన్న సిద్దార్థ్‌ మీద వ్యాఖ్యాత సల్మాన్‌ ఖాన్‌ జోక్‌ చేసిన వీడియో ఒకటి నెట్టింట వైరల్‌గా మారింది.

ఇందులో సల్మాన్‌ మాట్లాడుతూ.. 'ఈ ఆటలో అభిమానులు ఓట్లు వేసి నిన్ను సేవ్‌ చేశారు. కానీ పైనున్న ఆ భగవంతుడు మాత్రం నిన్ను కాపాడలేదు. ఈ వ్యక్తి ఏడుస్తాడు, అరుస్తాడు, ముఖం మీదే మాట్లాడతాడు. కానీ ఎక్కడో మూలన ఇతడు కూడా మంచి మనిషే. ఇక ఈ బిగ్‌బాస్‌ హౌస్‌లో కొందరు ప్రేమించుకుంటే మరికొందరు పెళ్లిళ్లు కూడా చేసుకున్నారు' అని నవ్వుతూ పేర్కొన్నాడు. ఇక సల్మాన్‌ మాటలకు సిద్దార్థ్‌ కూడా నవ్వుతుండటం వీడియోలో స్పష్టంగా కనిపిస్తుంది. సల్మాన్‌ అన్నట్లుగానే ఆ దేవుడు సిద్దార్థ్‌ను కాపాడలేదని అభిప్రాయపడుతున్నారు నెటిజన్లు.

మరిన్ని వార్తలు