ఐసీయూలో నటుడు.. ఆదుకున్న హీరో

15 Oct, 2020 12:40 IST|Sakshi

బాలీవుడ్‌ నటుడు ఫారజ్‌ ఖాన్‌ తీవ్ర అనారోగ్యంతో ఐసీయూలో చికిత్స పొందుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఫరాజ్‌ చికిత్స కోసం పెద్ద మొత్తంలో డబ్బు ఖర్చైందని, ఆర్థికంగా తమ పరిస్థితి బాగా లేనందున సహాయం అందించాల్సిందిగా కోరుతూ ఆయన సోదరుడు ఫండ్‌రైజింగ్‌ ప్లాట్‌ఫాంలో తమ దీనస్థితిని వివరిస్తూ సుదీర్ఘ పోస్టు షేర్‌ చేశాడు. దీనిపై బాలీవుడ్‌ కండల వీరుడు సల్మాన్‌ ఖాన్‌ స్పందించారు. ఫరాజ్‌ మెడికల్‌ బిల్లులన్నింటిని భాయి జాన్‌ చెల్లించారు. ఈ విషయాన్ని నటి కాశ్మీరా షా వెల్లడించారు. తన ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా సల్మాన్‌పై ప్రశంసలు కురిపించారు. ఈ మేరకు ఆమె ‘మీరు నిజంగా చాలా గొప్ప మనిషి. ఫరాజ్‌ ఖాన్‌కి సాయం చేసినందుకు ధన్యవాదాలు. అతడి పరిస్థితి చాలా విషమంగా ఉంది. ఈ సమయంలో మీరు అతడికి మద్దతుగా నిలిచి సాయం చేశారు. నేను ఎల్లప్పుడు మిమ్మల్ని ఆరాధిస్తాను. జనాలు ఈ పోస్ట్‌ని ఇష్టపడకపోవచ్చు. కానీ నేను పట్టించుకోను. వారు నన్ను ఫాలో కాకపోయినా నాకు అభ్యంతరం లేదు. చిత్ర పరిశ్రమలో నేను కలుసుకున్న అత్యంత గొప్ప వ్యక్తి మీరు’ అంటూ కాశ్మీరా ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా సల్మాన్‌పై ప్రశంసలు కురిపించారు. (చదవండి: భాయ్‌ బరిలో దిగుతున్నారు)

ఇక నెటిజనులు కూడా ‘ఆయనలాంటి వ్యక్తి ఎవరూ లేరు.. సల్మాన్‌ నిజంగా ఓ లెజెండ్’‌.. ‘భాయిజాన్‌ని గౌరవించండి.. మీ వెనక ఎలా అయినా మాట్లాడుకోనివ్వండి.. మా అందరికి తెలుసు మీరు మీ చుట్టూ ఉన్న వారిని ఎంత జాగ్రత్తగా చూసుకుంటారో.. నిస్సహాయులు, ఆపదలో ఉన్న వారికోసం మీరు ఎంత​ శ్రద్ధ వహిస్తారో మాకు తెలుసు’ అంటూ అభినందిస్తున్నారు. ఇక 1990 నాటి నటుడు ఫారజ్‌ ఖాన్‌ చెస్ట్‌, బ్రెయిన్‌ ఇన్‌ఫెక్షన్‌తో బాధ పడుతున్నారు. ప్రస్తుతం ఆయనను బెంగళూరులోని విక్రమ్‌ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వైద్యం నిమిత్తం 25 లక్షల రూపాయలు అవసరం ఉందని ఆదుకోవాలని ఆయన సోదరుడు కోరారు. ఇప్పటికే పూజా భట్‌ తన వంతు సాయం చేసిన సంగతి తెలిసిందే. 

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు