రాధే ఓటీటీకి రాదే!

21 Nov, 2020 02:37 IST|Sakshi

సల్మాన్‌ ఖాన్‌ సూపర్‌ పోలీస్‌గా తెరకెక్కిన చిత్రం ‘రాధే’. ప్రభుదేవా దర్శకత్వంలో తెరకెక్కిన ఈ స్టయిలిష్‌ ఎంటర్‌టైనర్‌లో దిశా పటానీ కథానాయిక. జాకీ ష్రాఫ్, రణ్‌దీప్‌ హుడ్‌ ముఖ్య పాత్రల్లో నటించారు. ఈ సినిమాను ఈ ఏడాది ఈద్‌ పండగకు విడుదల చేయాలనుకున్నారు. కోవిడ్‌ వల్ల ప్లాన్‌ మారింది. షూటింగ్‌ పూర్తి కాలేదు. థియేటర్స్‌ కూడా ఓపెన్‌ లేవు.

ఇటీవలే ఈ సినిమాను పూర్తి చేశారు. దాంతో ‘రాధే’ ఓటీటీకి వస్తుంది అనే వార్త బాగా వినబడుతోంది. కానీ ఈ వార్తలను ఖండించింది చిత్రబృందం. ‘రాధే’ ఓటీటీకి రాదని, వచ్చే ఏడాది ఈద్‌కి సల్మాన్‌ భాయ్‌ థియేటర్స్‌లోకి వస్తాడని స్పష్టం చేశారు. హిందీ మార్కెట్‌లో మళ్లీ ప్రేక్షకుల్ని థియేటర్స్‌కు తీసుకొచ్చే సినిమాల్లో సల్మాన్‌ ఖాన్‌ ‘రాధే’ చిత్రం చాలా కీలకం అని బాలీవుడ్‌లో ఓ టాక్‌ నడుస్తోంది.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు