స్టార్‌ హీరో సినిమా: థియేటర్లో‌, ఓటీటీలో ఒకేసారి!

22 Apr, 2021 06:10 IST|Sakshi

‘రాధే’ అనుకున్నట్టుగానే రంజాన్‌కు థియేటర్స్‌లో సందడి చేయనున్నాడు. అయితే ఈ నెల 13న ఒకేసారి ఇటు థియేటర్స్‌లో అటు ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో విడుదల కానుంది ‘రాధే’. ఓటీటీ డీల్‌ దాదాపు 230 కోట్లు ఉంటుందని బాలీవుడ్‌ టాక్‌. సల్మాన్‌ఖాన్‌ హీరోగా నటించిన చిత్రం ‘రాధే: యువర్‌ మోస్ట్‌ వాంటెడ్‌ భాయ్‌’.

గత ఏడాది కరోనా సమయంలో కూడా ఈ సినిమాకు ఓటీటీ ఆఫర్‌ వచ్చినా ముంబయ్‌ థియేటర్స్‌ ఓనర్స్, డిస్ట్రిబ్యూటర్స్‌ అభ్యర్ధనల మేరకు సల్మాన్‌ తన నిర్ణయాన్ని మార్చుకున్నారు. ఇప్పుడు ఒకేసారి ఓటీటీ, థియేటర్స్‌లో సినిమాను విడుదల చేస్తున్నారు. ముంబయ్‌లో థియేటర్స్‌ మూతబడటం, ఇంకా ఉత్తర, దక్షిణాదిన కొన్ని రాష్ట్రాల్లో 50 శాతం సీటింగ్‌ వంటివి ‘రాధే’ సినిమాను ఇలా థియేటర్, ఓటీటీలో రిలీజ్‌ చేయడానికి కారణం అయ్యుంటాయని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.

చదవండి: ‘రంగస్థలం’ తమిళ ట్రైలర్‌: చిట్టిబాబు చింపేశాడుగా

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు