Kabhi Eid Kabhi Diwali: పాటలు నచ్చలేదు.. దేవిశ్రీకి షాకిచ్చిన సల్మాన్‌!

29 Jun, 2022 16:05 IST|Sakshi

టాలీవుడ్ టాప్ మ్యూజిక్ కంపోజర్ రాక్ స్టార్  దేవిశ్రీప్రసాద్ ట్యూన్స్ అంటే సల్మాన్ ఖాన్‌కు చాలా ఇష్టం. అందుకే గతంలో దేవి కంపోజ్ చేసిన కొన్ని ట్రాక్స్ ను బాలీవుడ్ కు తీసుకెళ్లాడు. ఆర్య 2లోని రింగా రింగా, అలాగే డీజేలోని సీటీమార్ మ్యూజిక్ ను బాలీవుడ్ లో రిపీట్ చేశాడు.

అల్లు అర్జున్‌ నటించిన పాన్‌ ఇండియా చిత్రం పుష్పకు దేవి అందించిన ట్రాక్స్ సల్మాన్ కు ఇంకా బాగా నచ్చాయి. దీంతో ప్రస్తుతం తాను నటిస్తున్న కొత్త సినిమా కభీ ఈద్ కభీ దివాళీకి దేవిశ్రీ ప్రసాద్ను మ్యూజిక్ డైరెక్టర్ గా ఫిక్స్ చేసుకున్నాడు భాయ్ జాన్. కాని ఇప్పుడు ఈ చిత్రం నుంచి రాక్ స్టార్ తప్పుకున్నాడని బాలీవుడ్ వర్గాలు చెప్పుకొస్తున్నాయి. అందుకు ప్రధాన కారణం  దేవి శ్రీ ప్రసాద్ కంపోజ్ చేసిన ట్రాక్స్ సల్మాన్కు నచ్చకపోవడమే అట. ఇక దేవిశ్రీని తప్పించి  ఆ అవకాశం కేజీయఫ్‌  మ్యూజిక్ డైరెక్టర్ రవి బస్రూర్‌కు ఇచ్చాడట. 

(చదవండి: ఆస్కార్‌ నుంచి సూర్యకు ఆహ్వానం.. తొలి సౌత్ ఇండియా హీరోగా రికార్డు)

భాయ్ జాన్ నుంచి బిగ్ ఫిల్మ్ ఆఫర్ రావడంతో వెంటనే ఒకే అనేసాడు రవిబస్రూర్. అంతే కాదు కభీ ఈద్ కభీ దివాళి టైటిల్ కంపోజ్ చేసి సల్మాన్ ను ఇంప్రెస్ చేశాడట.  ఈ చిత్రంలో సల్మాన్, వెంకీ, రామ్ చరణ్ తేజ్, పూజా హెగ్డే కలసి స్టెప్పులేసే స్పెషల్ సాంగ్ కోసం కూడా రవినే సెన్సేషనల్ ట్రాక్ అందించబోతున్నాడట.

మరిన్ని వార్తలు