‘సల్మాన్‌కు దుబాయ్‌లో భార్య, 17 ఏళ్ల కూతురుంది’.. నటుడి కామెంట్‌

21 Jul, 2021 20:36 IST|Sakshi

అర్బాజ్ ఖాన్ తన టాక్‌ షో ‘పించ్’ కొత్త సీజన్‌ ద్వారా అలరించేందుకు రెడీ అయ్యాడు. ప్రస్తుతం ఈ షో రెండో సీజన్ నడుస్తోంది. దీని మొదటి ఎపిసోడ్‌ జూలై 21న స్ట్రీమింగ్‌ అయ్యింది. ఈ షోలో సోషల్ మీడియాలో తమ మీద వచ్చినటువంటి ట్రోల్సింగ్స్‌ గురించి సెలబ్రిటీలు సమాధానం చెప్పడం మెయిన్ థీమ్.ఈ షోకు మొదటి అతిథిగా బాలీవుడ్ కండల వీరుడు, అర్బాజ్‌ ఖాన్‌ సోదరుడు సల్మాన్ ఖాన్‌ హాజరయ్యాడు. ఈ సందర్భంగా సల్లూ భాయ్‌ తన వయసు, సినిమాలు, జీవితం మీద వచ్చిన గాసిప్స్‌పై స్పందించి సమాధానం ఇచ్చాడు.

ఈ క్రమంలో గతంలో ఓ ట్విటర్‌ యూజర్‌ సల్మాన్‌కు దుబాయ్‌లో నూర్‌ అనే భార్య, 17 ఏళ్ల కూతురు ఉందని ఆరోపిస్తూ పోస్ట్‌ చేసిన ట్వీట్‌ను ప్రస్తావిస్తూ నిజమేనా అని ప్రశ్నించాడు. దీనిపై సల్మాన్‌ ఖాన్‌ మాట్లాడుతూ.. ‘ఈ జనాలకు సమాచారం బాగానే అందుతుంది. కానీ అసలివి నాకు సంబంధంలేని విషయాలు. వారు ఎవరి గురించి మాట్లాడుతున్నారో నాకు తెలియదు. దీనికి నేను సమాధానం చెప్పాలని వారు అనుకుంటున్నారా. నాకు భార్య లేదు, నేను హిందూస్తాన్, గెలాక్సీ అపార్టుమెంటులో నివసిస్తున్నాను. నా తండ్రి కూడా నా పై ఇంటిలో నివసిస్తున్నారు. ఇది భారత్‌లో అందరికీ తెలిసిన విషయం’. అని బదులిచ్చాడు.

అలాగే మరో ట్వీట్‌ను అర్బాజ్‌ చదివి వినిపించాడు. అందులో సల్మాన్‌ నకిలీ వ్యక్తి అ అతను మంచివాడిలా నటిస్తున్నాడని ఆరోపించారు. దీనిపై సల్మాన్‌ స్పందిస్తూ. అతనికి ఎక్కడో ఒక చెడు అనుభవం ఎదురై ఉండాలి. ఒకవేళ తన భార్య నన్ను పొగడ్తలతో ముంచెత్తి ఉండాలి లేదా తన కూతురు నా సినిమా చూపించాలని పట్టుబట్టి ఉంటారని సరదాగా సమాధానమిచ్చాడు. మరోవైపు  హిందీ బిగ్‌బాస్‌ 15వ సీజన్‌కు సల్మాన్‌ హోస్ట్‌గా వ్యవహరిస్తున్నాడు. తనదైన యంకరింగ్‌తో భాయిజాన్‌ ఈ సీజన్‌కు షోను ఆసక్తిగా మలిచేందుకు సిద్ధమవుతున్నాడు.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు