సల్మాన్‌ బ్యాడ్‌లక్‌.. ఈ ఏడాది కూడా లేనట్లే

17 Apr, 2021 00:31 IST|Sakshi

‘రాధే’ రావడం మరోసారి వాయిదా పడ్డట్లేనని తెలుస్తోంది. సల్మాన్‌  ఖాన్‌  హీరోగా నటించిన తాజా చిత్రం ‘రాధే: యువర్‌ మోస్ట్‌ వాంటెడ్‌ భాయ్‌’. ఈ చిత్రానికి ప్రభుదేవా దర్శకుడు. గత ఏడాది ఈద్‌కు విడుదల కావాల్సిన ‘రాధే’ సినిమా అప్పటి కరోనా పరిస్థితుల కారణంగా ఈ ఏడాది రంజాన్‌కు రావడానికి రెడీ అయింది. కానీ ఇప్పుడు కరోనా సెకండ్‌ వేవ్‌ కారణంగా ఈ సినిమాను చిత్రబృందం మరోసారి వాయిదా వేసిందని బాలీవుడ్‌లో కథనాలు వస్తున్నాయి.

అయితే కొన్ని రోజుల క్రితం ‘రాధే’ సినిమా ఈ రంజాన్‌ కు విడుదల కాకపోతే బక్రీద్‌ సందర్భంగా జూలై 21న విడుదలవుతుందని బాలీవుడ్‌లో ప్రచారం సాగింది. కానీ మహారాష్ట్రలో థియేటర్స్‌ మూసివేత, ఢిల్లీ థియేటర్లలో ముపై శాతం సీటింగ్‌ సామర్థ్యం వంటి కారణాలతో ‘రాధే’ సినిమాను ఈ ఏడాది రిలీజ్‌ చేయాకూడదని అనుకుంటున్నారట నిర్మాతలు. గత ఏడాది వచ్చిన 200 కోట్ల ఓటీటీ ఆఫర్‌ వద్దనుకుని పంపిణీదారులు, థియేటర్‌ అధినేతల విజ్ఞప్తుల మేరకు ఈ సినిమాను థియేటర్స్‌లో రిలీజ్‌ చేస్తామని సల్మాన్‌  హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. సో.. ‘రాధే’ ఓటీటీకి వచ్చే అవకాశం లేదు. మరి.. తాజా పరిస్థితుల దృష్ట్యా చిత్రనిర్మాతలు మనసు మార్చుకుంటారేమో చూడాలి. 

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు