Tiger-3 Sandesam: సల్మాన్‌ ఖాన్‌ టైగర్‌ సందేశం వచ్చేసింది

27 Sep, 2023 12:00 IST|Sakshi

బాలీవుడ్‌ స్టార్స్ సల్మాన్‌ఖాన్‌, కత్రినా కైఫ్‌ జంటగా నటించిన ఏక్‌ థా టైగర్‌, టైగర్‌ జిందా హై చిత్రాల్లో మెప్పించారు. ఈ ప్రాంఛైజీలో భాగంగా వస్తున్న చిత్రమే టైగర్‌-3. గత రెండు చిత్రాలతో సల్మాన్‌ ఖాన్‌, కత్రినా కైఫ్‌ జంట ప్రేక్షకులను  మెప్పించింది. ఆ చిత్రాల్లో టైగర్‌గా సల్మాన్‌ సాహసాలు, జోయాగా కత్రినా గ్లామర్‌ వహ్వా అనిపించాయి.

ఇప్పుడు ఆ సిరీస్‌లో తదుపరి చిత్రంగా టైగర్‌ సందేశ్‌ పేరుతో మేకర్స్‌ ఒక వీడియోను విడుదల చేశారు. ఈ  సీక్వెల్‌ చిత్రానికి మనీశ్‌ శర్మ దర్శకుడు. యశ్‌ రాజ్‌ ఫిల్మ్స్‌ సమర్పణలో రానున్న ఈ చిత్రానికి ఆదిత్య చోప్రా నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఇదొక ప్రతీకార యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రానుంది. టైగర్ తన శత్రువులను వేటాడేందుకు ప్రాణాపాయకరమైన మిషన్‌ను ఎలా సాగిస్తాడో చూపించేదే ఈ సినిమా కథాంశం.

(ఇదీ చదవండి: ప్రభాస్‌ వల్ల ఇబ్బందుల్లో చిక్కుకున్న ముగ్గురు టాప్‌ హీరోలు)

టైగర్ తన దేశం కోసం, తన కుటుంబం కోసం తన పేరును దాచి ఒక స్పైగా పనిచేస్తాడు. తాజాగా విడుదలైన టైగర్‌ సందేశ్‌లో సల్మాన్‌ చెబుతున్న డైలాగ్స్‌ చాలా పవర్‌ఫుల్‌గా ఉన్నాయి. ఇందులోని యాక్షన్ సీన్స్‌ అదిరిపోయే రేంజ్‌లో చిత్రీకరించినట్లు తెలుస్తోంది. నవంబరు 10న దిపావళికి ఈ చిత్రం విడుదల అవుతుందని టైగర్‌ మేకర్స్‌ ప్రకటించారు.

మరిన్ని వార్తలు