Kabhi Eid Kabhi Diwali Movie: వెంకటేష్-సల్మాన్ ఖాన్ సినిమా షురూ.. విలన్​గా ?

30 Apr, 2022 08:12 IST|Sakshi

Salman Khan Venkatesh Starrer Kabhi Eid Kabhi Diwali Shoot Started: కొత్త సినిమా షూటింగ్‌ షురూ అంటున్నారు బాలీవుడ్‌ కండలవీరుడు సల్మాన్‌ ఖాన్‌. ఫర్హాద్‌ సామ్‌జీ దర్శకత్వంలో సల్మాన్‌ ఖాన్, వెంకటేష్​, పూజా హెగ్డే ప్రధాన తారాగణంగా ‘కబీ ఈద్‌ కబీ దీవాలి’ (‘బాయిజాన్‌’ అనే టైటిల్‌ కూడా ప్రచారంలో ఉంది) అనే సినిమా రూపొందనున్న సంగతి తెలిసిందే. అయితే కొన్ని  కారణాల వల్ల వాయిదా పడుతూ వస్తోన్న ఈ సినిమా షూటింగ్‌ ఎట్టకేలకు వచ్చే నెలలో ప్రారంభం కానుంది. మే 11న ఈ సినిమా షూటింగ్‌ను ముంబైలో ఆరంభించనున్నారు. ఇందు కోసం ఓ భారీ సెట్‌ వేశారు. ఈ షెడ్యూల్‌లో సల్మాన్‌ ఖాన్‌ కూడా పాల్గొంటారు. ఇక ఇటీవల ‘రానా నాయుడు’ వెబ్‌ సిరీస్‌ కోసం ముంబైలో ఉంటున్న వెంకటేశ్‌ కూడా ఈ షెడ్యూల్‌లో జాయిన్‌ అయ్యే అవకాశం ఉంది.  

విలన్‌గా.. 
దక్షిణాదిన తిరుగు లేని విలన్‌గా దూసుకెళుతోన్న జగపతిబాబు ‘కబీ ఈద్‌ కబీ దీవాలి’లో విలన్‌గా నటిస్తారనేది బీ టౌన్‌ టాక్‌. ఒకవేళ ఈ వార్త నిజమైతే హిందీలో జగపతిబాబుకి ఇదే తొలి చిత్రం అవుతుంది. ఈ సినిమాను తొలుత వచ్చే ఏడాది రంజాన్‌కు రిలీజ్‌ చేయాలనుకున్నారు. కానీ ఈ ఏడాది డిసెంబరు 30నే సినిమాను రిలీజ్‌ చేస్తామని ఇటీవల చిత్రయూనిట్‌ తెలిపింది.

చదవండి: ఇంతవరకు నేను సౌత్‌ సినిమాలే చూడలేదు: బాలీవుడ్‌ నటుడు
అడల్ట్‌ సైట్‌లో ఫోటో లీక్‌, 15ఏళ్లకు చేదు అనుభవం: నటి

మరిన్ని వార్తలు