‘అంతిమ్‌’లో పోలీస్‌గా నటించేటప్పుడు కొంచెం భయపడ్డాను: సల్మాన్‌ ఖాన్‌

29 Nov, 2021 12:01 IST|Sakshi
‘యాంటిమ్‌’ చిత్రంలో సల్మాన్‌ ఖాన్‌

Salman Khan: బాలీవుడ్‌ కండల హీరో సల్మాన్‌ ఖాన్‌ హీరోగా, ఆయుష్‌ శర్మ ప్రతినాయకుడిగా కలిసి నటించిన మల్టీస్టారర్‌ చిత్రం ‘అంతిమ్‌’. ప్రస్తుతం ఈ మువీ బాక్సాఫీస్‌ వద్ద బారీ వసూళ్లు రాబడుతోంది. నవంబర్‌ 26న రిలీజ్‌ అయిన యాంటిమ్‌ చిత్రం కేవలం 3 రోజుల్లోనే 17 కోట్ల రూపాయలు వసూళ్లు చేసింది. 

చిత్రం విజయంపై బాయ్‌ తాజాగా మీడియాతో సంభాషించారు. 'అంతిమ్‌' మువీలో పోలీసుగా నటించడానికి భయపడ్డానని,  గతంలో పోషించిన పోలీసు పాత్రలతో పోల్చితే ఇది విభిన్నమైన పాత్ర అని, చిత్రం మొత్తం చాలా సరదాగా సాగిపోతుందని మీడియాకు తెలిపారు. ప్రస్తుతం సల్మాన్ 'అంతిమ్‌' ప్రమోషన్స్‌పై దృష్టి సారించారు. దీనిలో భాగంగా దేశంలోని మెట్రో నగరాలకు వెళ్లనున్నారు. చిత్రం బృందంతో కలిసి 'అంతిమ్‌' ప్రచారం కోసం గుజరాత్, ఢిల్లీ, తన స్వస్థలమైన ఇండోర్‌కు వెళ్లినట్లు సమాచారం.

మరిన్ని వార్తలు