Salman Khan: రూటు మార్చిన సల్లూ భాయ్‌.. చిరు, వెంకీలతో సినిమాలకు సై!

3 Dec, 2021 14:24 IST|Sakshi

బాలీవుడ్ హీరోలు అంటే హిందీ సినిమాల్లోనే నటిస్తారు. నార్త్ ఆడియెన్స్ గురించే ఆలోచిస్తారు. బీటౌన్ కే పరిమితం అవుతారు. అస్సలు టాలీవుడ్  వైపు చూడరు. ఇక్కడ పెద్దగా పరిచయాలు ఉండవు. నిన్న మొన్నటి వరకు ఉత్తరాది హీరోల తీరు ఇది. కాని ఇప్పుడిప్పుడు పరిస్థితులు మారిపోతున్నాయి. సాక్షాత్తు సల్మాన్ ఖాన్ తెలుగు సినిమాల్లో నటించేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు.

బాలీవుడ్ బాక్సాఫీస్ కింగ్ భజరంగీ భాయ్ జాన్ టాలీవుడ్ కు వస్తున్నాడు. రావడం అంటే డబ్బింగ్ సినిమా తో కాదు. డైరెక్ట్ గా తెలుగు చిత్రాల్లో నటించబోతున్నాడు.తన ఫేవరేట్ తెలుగు స్టార్స్ తో కలసి నటించబోతున్నట్లు ప్రకటించాడు.

ప్రస్తుతం అంతిమ్ సినిమా ప్రమోషన్ లో బిజీగా ఉన్నాడు సల్మాన్ ఖాన్. ప్రమోషన్ లో భాగంగానే ఇటీవల హైదరాబాద్ వచ్చాడు. అప్పుడే తాను చేయబోతున్న తెలుగు చిత్రాల గురించి చెప్పుకొచ్చాడు. చిరంజీవితో కలసి గాడ్‌ ఫాదర్ లో కీరోల్ చేయబోతున్నట్లు ప్రకటించాడు. త్వరలోనే డేట్స్ లాక్ చేయనున్నాడు. ఈ మూవీతో పాటు వెంకటేష్ కలసి మరో మూవీ చేయబోతున్నట్లు తెలిపాడు. అయితే ఈ ప్రాజెక్ట్ ఏంటి అనేది ఇంకా క్లారిటీ రాలేదు.

స్నేహానికి ఎక్కువ ప్రాముఖ్యతను ఇస్తాడు దబంగ్ ఖాన్. ఫ్రెండ్స్ కనిపించగానే ఐస్ అయిపోతాడు. వారి కోసం ఏదైనా చేసేందుకు సిద్ధమవుతాడు. అలా లెక్కలేనన్నిసార్లు ఇతర హీరోల సినిమాల్లో గెస్ట్ అప్పీరెయన్స్ ఇచ్చాడు. ప్రస్తుతం షారుఖ్ నటిస్తున్న పఠాన్ లోనూ, అలాగే ఆమిర్ ఖాన్ కొత్త చిత్రం లాల్ సింద్ చద్దాలోనూ గెస్ట్ అప్పీయరెన్స్ ఇవ్వబోతున్నాడు.

మరిన్ని వార్తలు