కువైట్ పరిస్థితుల నేపథ్యంలో వస్తున్న ‘సాల్ట్’

17 Mar, 2021 15:07 IST|Sakshi

అన్ని డిజిటల్ ఫ్లాట్ ఫామ్ లలో మార్చి 17 న విడుదల 

ఒక అమ్మాయి అనుకోని పరిస్థితుల్లో ఒక సంఘటనలో చిక్కుకొంటే ఆ అమ్మాయి ఆ ప్రాబ్లమ్ నుండి ఎలా బయట పడిందనే కథాంశంతో ఆద్యంతం ఆసక్తికరంగా వాస్తవికత వినోదాల మేళవింపుతో కువైట్ పరిస్థితుల నేపథ్యంలో చిత్రీకరించిన చిత్రం "సాల్ట్".  సింక్ ఫ్రేమ్ పతాకంపై అబ్దుల్ ముజీర్, ఖాజా మొయినుద్దీన్, బాబావలి షేక్, హైదర్ షేక్, మస్తాన్ యోయో ప్రధాన పాత్రలుగా మున్నా సయ్యద్ దర్శకత్వంలో వెంకట్ కోడూరు నిర్మించిన సస్పెన్స్, థ్రిల్లర్ మర్డర్, మిస్టరీ చిత్రం ‘సాల్ట్’అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని ఈ నెల 17 న అమెజాన్, ఎయిర్ టెల్ ఎక్స్ట్రీమ్, హంగామా, యమ్ యక్స్ ప్లేయర్, ఓడాఫోన్ ఐడియా మొదలగు అన్ని ఓటీటీ ఫ్లాట్ ఫామ్ లలో విడుదల చేస్తున్నారు.

ఈ చిత్ర దర్శక,నిర్మాతలు కువైట్ లో ఉన్నందున వారి ప్రతినిధిగా తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబెర్ డాక్టర్ పద్మిని నాగులపల్లి ఆద్వర్యంలో హైదరాబాద్ లోని ఫిలిం ఛాంబర్ లో పాత్రికేయుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా వచ్చిన ప్రొడ్యూసర్ కౌన్సిల్ సెక్రటరీ ప్రసన్నకుమార్  నిర్మాత తుమ్మలపల్లి రామ సత్యనారాయణ, ఘర్షణ శ్రీనివాస్,దర్శక,నిర్మాత మంజుల సూరజ్, నిర్మాత యమ్ ఆర్.సి చౌదరి, దర్శకుడు నల్లపూసల బాబ్జి, దర్శక,నిర్మాత వెంకటప్పరావు, అమెజాన్ రాజీవ్, రావిపల్లి రాంబాబు,చరణ్ నటుడు, నిర్మాత సురేష్ తదితరులు పాల్గొని చిత్ర ట్రైలర్స్,పోస్టర్స్ లను విడుదల చేశారు.

అనంతరం తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఎగ్జిక్యూటివ్  కమిటీ మెంబెర్ డాక్టర్ పద్మిని నాగులపల్లి  మాట్లాడుతూ .."సాల్ట్" మూవీ మొత్తం కువైట్ లోనే చిత్రీకరించడం జరిగింది. కువైట్ లో ఉన్న తెలుగు వారందరూ కలసి రూపొందిన సస్పెన్స్, థ్రిల్లర్ "సాల్ట్". ఈ చిత్రం ప్రీ లాంచ్ ఇక్కడ జరుపు కుంటున్నాము. దర్శక, నిర్మాతలు ఇక్కడ లేకపోయినా వారు తీసిన సినిమాకు మేమున్నాం అంటూ ఇక్కడున్న దర్శక నిర్మాతలు సపోర్ట్ గా నిలిచారు వారికి నా ధన్యవాదాలు. ఈ సినిమాకు ఇంత హైప్ రావడానికి ముఖ్య కారణం దర్శక,నిర్మాత వెంకటప్పరావు, ప్రభంజన్ గార్లే. కరోనా టైం లో కూడా ధైర్యం చేసి కువైట్ నేపథ్యంలో  నిర్మించిన "సాల్ట్" చిత్రం వెంకట్ కోడూరు గారికి పెద్ద విజయం సాధించాలని అన్నారు.

ప్రొడ్యూసర్ కౌన్సిల్ సెక్రటరీ ప్రసన్నకుమార్ మాట్లాడుతూ ...ప్రతి మనిషికి బీపీఎక్కువైనా, తక్కువైనా ప్రతి రోజు  మాట్లాడుకునేది "సాల్ట్" గురించే. అలాంటిది ఈ సాల్ట్ ఏంత ఇంపార్టెంటో  మనందరికీ తెలుసు. అన్ని ఓటీటీ ఫ్లాట్ ఫామ్ లలో విడుదల అవుతున్న ఈ చిత్రం పెద్ద విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటానని అన్నారు.

 నిర్మాత తుమ్మలపల్లి రామ సత్యనారాయణ మాట్లాడుతూ.. దర్శకనిర్మాతల ధైర్యానికి మెచ్చుకోకుండా ఉండలేక పోతున్నాను.డబ్బు సంపాదించాలని కాకుండా వారంతా సినిమా పై ఉన్న ఫ్యాషన్ తో  ఈ చిత్రాన్ని నిర్మించారు.వారికి ఈ సినిమా పెద్ద విజయం సాధించాలని అన్నారు. నటుడు ఘర్షణ శ్రీనివాస్ మాట్లాడుతూ.. కొత్త ఆర్టిస్టులను అవకాశం కల్పిస్తూ నిర్మించిన ఈ "సాల్ట్" చిత్రం పెద్ద విజయం సాధించాలని అన్నారు.

 నటుడు,నిర్మాత సురేష్ మాట్లాడుతూ..  ఎంత కాస్ట్ లీ బిర్యానీ తిన్నా సాల్ట్ లేకపోతే రుచి ఉండదు.ఆ "సాల్ట్" కు అంత డిమాండ్ ఉంది. ఆలాంటి మంచి టైటిల్ తో మనముందుకు వస్తున్న ఈ చిత్రం పెద్ద విజయం సాధించాలని అన్నారు. రావిపల్లి రాంబాబు, మాట్లాడుతూ... కువైట్ పరిస్థితుల నేపథ్యంలో తీసిన ఈ "సాల్ట్" చిత్రం టీజర్ చాలా బాగుంది.ఈ సినిమా పెద్ద విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుతున్నానని అన్నారు. బల్లెం వేణుమాధవ్ మాట్లాడుతూ ..కువైట్ లో ఉన్న వ్యకులని గుర్తించి తీసిన వెంకట్ కోడూరి గారి "సాల్ట్" చిత్రం డిజిటల్ మీడియా ద్వారా విడుదల అవుతున్న ఈ చిత్రం పెద్ద విజయం సాధిస్తుందని అన్నారు.

 సీనియర్ నిర్మాత యమ్ ఆర్.సి చౌదరి, మాట్లాడుతూ ..నేను చాలా సినిమాలు నిర్మించినా ఇంతమంది గెస్ట్ లను పిలిపించుకోలేక పోయాను. అలాంటిది వెంకట్ కోడూరు గారి ప్రజెన్స్ లేకుండా ఇంతమంది గెస్ట్ లు వచ్చి సినిమా విజయం సాధించాలని ఆశీర్వదిస్తున్నారు . అద్భుతమైన టైటిల్ తో వస్తున్న ఈ సినిమా పెద్ద విజయం సాధించాలని అన్నారు. దర్శక,నిర్మాత మంజుల సూరజ్ మాట్లాడుతూ..  వెంకట్ కోడూరు గారు కువైట్ లో ఉంటూ ఎంతో ఫ్యాషన్ తో ఈ సినిమా తీశారు.వారు తీసిన "సాల్ట్" చిత్రం పెద్ద విజయం సాధించి మరిన్ని సినిమాలు నిర్మిచాలని అన్నారు.

ఎక్స్ సర్వీస్ మ్యాన్  ప్రభంజన్ మాట్లాడుతూ.. మున్నా సయ్యద్ ఈ సినిమాను చాలా చక్కగా తీశారు. ఇక్కడున్న వారే సినిమా తీస్తే ఎంత లాభం వస్తుందని  ఆలోచిస్తున్నారు. అలాంటిది కువైట్ లో ఉంటూ సినిమా తీసిన వెంకట్ కోడూరి గారికి నా  ధన్యవాదాలు. వారికి ఈ సినిమా మంచి పేరుతో పాటు డబ్బు రావాలని ఆశిస్తున్నా నని అన్నారు. 

 దర్శకుడు నల్లపూసల బాబ్జి మాట్లాడుతూ.. కరోనా రావడం వలన ఓ.టి.టి ఫ్లాట్ ఫామ్స్ లకు డిమాండ్ పెరిగిపోయింది.ప్రస్తుతం చాలా మంది ఫ్యామిలీస్ తో కలసి ఇంట్లోనే సినిమా చూస్తున్నారు. కరోనా తరువాత చాలా మందికి డబ్బులు ఇబ్బంది అయ్యాయి. అలాంటి కరోనా టైం లో కూడా "సాల్ట్" పేరుతో  సినిమాను తీసిన నిర్మాతల గట్స్ కు మెచ్చుకోవాలి. ఈ సినిమా వారికి పెద్ద విజయం సాధించి మంచి పేరు తీసుకు రావాలని అన్నారు.ఇంకా ఈ కార్యక్రమంలో అమెజాన్ రాజీవ్, నటుడు చరణ్, జ్వాల చక్రవర్తి తదితరులు పాల్గొని గల్ఫ్ నేపథ్యంలో తీసిన ఈ చిత్రం విడుదల అవుతున్న అన్ని డిజిటల్ ఫ్లాట్ ఫామ్ లలో  గొప్ప విజయం సాదించాలని అన్నారు.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు