క్రేజీ అప్‌డేట్‌: ‘బంగార్రాజు’లో చైతన్యకు జోడి ఎవరంటే..!

17 May, 2021 21:13 IST|Sakshi

నాగార్జున అక్కినేని-రమ్యకృష్ణ జంటగా నటించిన హిట్‌ మూవీ ‘సోగ్గాడే చిన్నినాయన’కు సీక్వెల్‌గా ‘బంగార్రాజు’ మూవీ వస్తున్న సంగతి తెలిసిందే. ఈ మూవీలో అక్కినేని వారసులు నాగచైతన్య, అఖిల్‌లు కూడా నటిస్తున్నారు, వారు ప్రధాన పాత్రలు పోషిస్తున్నట్లు ఈ మధ్య వార్తలు వినిపిస్తున్నాయి. తాజాగా ఈ మూవీకి సంబంధించిన మరో క్రేజీ అప్‌డేట్‌ సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతుంది. బంగార్రాజులో చైతన్య జోడిగా ఆయన భార్య, స్టార్‌ హీరోయిన్‌ సమంత నటించనున్నట్లు తెలుస్తోంది.

ఇందులో చైసామ్‌లు రీయల్‌ లైఫ్‌లో లాగే తెరపై బంగార్రాజు(నాగార్జున) కొడుకు-కోడలుగా ఈ జంట సందడి చేయనుందట. ఇక ఇప్పటికే సమంత, చైతన్యలు జోడిగా ‘మనం’ మూవీలో నటించిన సంగతి తెలిసిందే. ఆ సినిమా బ్లాక్‌బస్టర్‌ హిట్‌ అయ్యింది. దీంతో బంగార్రాజులో కూడా ఇదే కాంబినేషన్‌ను రీపిట్‌ చేసి అంతటి స్థాయిలో హిట్‌ కొట్టాలని దర్శక-నిర్మాతలు భావిస్తున్నారట. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన కూడా వెలువడనుందని సమాచారం. ​కాగా అన్నపూర్ణ స్టూడియోస్‌ ప్రొడక్షన్‌లో నాగార్జున నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని ‘సోగ్గాడే చిన్నినాయన’ డైరెక్టర్‌ కల్యాణ్‌ కృష్ణ తెరకెక్కిస్తున్నాడు. జూన్‌, జూలైలో ఈ మూవీ షూటింగ్‌ ప్రారంభం కానుందట. 

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు