మీరు మాకు స్ఫూర్తి.. హ్యాపీ బర్త్‌ డే: సమంత

18 Nov, 2020 18:03 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రెండు దశాబ్దాలుగా తెలుగు, తమిళ పరిశ్రమలో అగ్రనటిగా రాణిస్తున్న అందాల భామా నయనతార నేటితో 36వ వసంతంలోకి అడుగుపెడుతున్నారు. ఈ రోజు(నవంబర్‌ 18) నయన్‌ పుట్టిన రోజు సందర్భంగా పలువురు సినీ ప్రముఖులు ఆమె శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఇక తన కాబోయే భర్త, ప్రియుడు విఘ్నేశ్‌ శివన్‌, నయనతారను బంగారం అంటూ స్పషల్‌ విషెస్‌ చెప్పాడు. ఈ నేపథ్యంలో టాలీవుడ్‌ అగ్రనటి, అక్కినేని వారి కోడలు సమంత, నమనతారకు ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలిపారు. అంతేగాక నయన్‌పై ప్రశంసల జల్లు కురిపస్తూ శక్తివంతమైన సందేశం ఇచ్చారు. తన ట్విటర్‌ ఖాతాలో బర్త్‌డే గర్ల్‌ నయనతారా... గులాబి రంగు టీ-షర్ట్‌ ధరించి కెమెరా వైపు సూటిగా చూస్తున్న ఫొటోను షేర్‌ చేస్తూ.. ‘వన్‌ అండ్‌ ఒన్లీ నయనతారకు పుట్టినరోజు శుభాకాంక్షలు. మీరు ఎల్లప్పుడు ఇలాగే ప్రకాశవంతంగా వెలుగుతూ ఉండాలి. అలాగే కావాల్సిన దాని కోసం నిరాంతరాయుంగా పోరాడే మీరు మాకు స్ఫూర్తినిచ్చారు. మీరు ఎంతో శక్తివంతురాలు సోదరి. మీ బలం, నిశ్శబ్ద సంకల్పానికి నా వందనాలు.. హ్యీపీ బర్త్‌డే నయనతార’ అంటూ చేతులు జోడించిన ఎమోజీని జత చేశారు సమంత. (చదవండి: నయన్‌కు ‍ప్రియుడి స్పెషల్‌ విషెస్‌)

కాగా నయన్‌ పుట్టిన రోజు సందర్భంగా ఆమె ప్రధాన పాత్రలో నటిస్తున్న తమిళ చిత్రం 'నెట్రికన్‌' (మూడో కన్ను) మూవీ టీజర్‌ను చిత్ర యూనిట్‌ విడుదల చేసింది. ఈ సినిమాలో నయన్‌ అంధురాలిగా సరికొత్త పాత్రలో కనిపించబోతున్నారు. అయితే మూడు పదుల వయసులో కూడా ఏమాత్రం నయన్‌ సినీ గ్లామర్‌ తగ్గలేదు. ఇప్పటికి నేటితరం హీరోయిన్‌లతో పోటీ పడుతూ అత్యధిక పారితోషం తీసుకుంటున్న నటిగా రాణిస్తున్నారు. అయితే ఇటీవల తమిళంలో ఆమె నటించిన ‘మూకితి అమ్మన్’ (తెలుగులో అమ్మోరు తల్లి) చిత్రం డిస్నీప్లస్‌ హాట్‌స్టార్‌లో విడుదలైన విషయం తెలిసిందే. ఈ సినిమాకు నయన్‌ దాదాపు 4 కోట్ల రూపాయల పారితోషికం తీసుకున్నట్లు సినీ వర్గాల సమాచారం. అయితే సమంత, నయనతారలు విఘ్నేశ్‌ శివన్‌ దర్శకత్వంలో రూపోందనున్న ‘కాతువాకుల రేండు కాదల్‌’లో నటించనున్నారు. గతేడాది ఈ సినిమా ఫస్ట్‌ లుక్‌ను హీరో విజయ్‌ సేతుపతి విడుదల చేసిన విషయం తెలిసిందే. కరోనా వైరస్‌ నేపథ్యంలో వాయిదా పడిన ఈ సినిమా షూటింగ్‌ వచ్చే ఏడాది సెట్స్‌పైకి వెళ్లనున్నుట్లు చిత్ర బృందం సమాచారం. (చదవండి: నీడలో నయనతార)

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా