చై కోసం జిమ్‌కి వెళ్లా

28 Jan, 2021 05:03 IST|Sakshi

తను చేసిన పాత్రల్లో సమంతకి ఏది ఇష్టం? సమంత ఫేవరెట్‌ పుస్తకం ఏది? సోషల్‌ మీడియా ట్రోల్స్‌ను సమంత ఎలా హ్యాండిల్‌ చేస్తారు? 2021లో స్యామ్‌ తీసుకున్న కొత్త నిర్ణయాలేంటి? ఇన్‌స్టాగ్రామ్‌లో అభిమానులతో సరదా చిట్‌చాట్‌ చేశారు సమంత. ఫ్యాన్స్‌ అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పారు. అందులో కొన్ని ఇక్కడ చూడొచ్చు.

► మీరు చేసిన సినిమాల్లో మీకు బాగా నచ్చిన పాత్ర ఏది?
‘ఓ బేబి’ సినిమాలో చేసిన క్యారెక్టర్, ‘ఫ్యామిలీ మ్యాన్‌’ (వెబ్‌ సిరీస్‌)లో చేసిన పాత్ర.. ఈ రెండూ చాలా ఇష్టం.

► 20 ఏళ్ల సమంతకు మీరు ఏదైనా సలహా ఇవ్వాలంటే ఏమిస్తారు?
‘కొంచెం ఎదుగు అమ్మాయి’ అని చెబుతాను. తెలియకుండా తను చాలా సిల్లీ సిల్లీ తప్పులు చేసింది (నవ్వుతూ).

► మీకు చాలా నచ్చిన పుస్తకం?
ఒక్క పుస్తకం అని చెప్పలేను. కానీ చిన్నప్పుడు ఎస్ట్రిక్స్, ఓబ్లిక్స్‌ కామిక్స్‌ వల్ల పుస్తక పఠనం అలవాటయింది.

► సోషల్‌ మీడియాలో వచ్చే విమర్శలు, ట్రోల్స్‌ మీ మీద ప్రభావం చూపుతాయా?
ఇంతకు ముందు చాలా ప్రభావం చూపేవి. కొన్ని కామెంట్స్‌ చూసి నిద్రపోని రోజులు కూడా ఉన్నాయి. అయితే ఇప్పుడు విమర్శలను పట్టించుకోవడం మానేశాను. ఇప్పుడు ఆ నెగటివ్‌ కామెంట్స్‌ను చూసి నవ్వుకుంటూ ఉంటాను. ఆ విషయంలో చాలా ఎదిగాననే అనుకుంటున్నాను.

► 2020లో బెస్ట్‌ మొమెంట్‌ ఏంటి?
రానా, మిహీకల పెళ్లి జరగడం.

► చైతన్య (నాగచైతన్య) సోషల్‌ మీడియాలో ఎందుకు యాక్టివ్‌గా ఉండరు?
కదా..! చైతన్యనే అడుగుదాం. చైతన్యా.. మీరు సోషల్‌ మీడియాలో ఎందుకు యాక్టివ్‌గా ఉండరు?

► ప్రేక్షకులు మిమ్మల్ని ఎలా గుర్తుపెట్టుకోవాలి అనుకుంటారు?
నేనెప్పుడూ ప్రస్తుతం గురించి మాత్రమే ఆలోచిస్తాను. ఈ క్షణం సంతోషంగా ఉన్నామా? లేదా? ఆనందంగా ఉన్నామా?  లేదా? అనేదే ముఖ్యం. ఇంకేదీ ఆలోచించను.

► మీకు ఫిట్‌నెస్‌ మీద.. జిమ్‌ మీద అంత శ్రద్ధ ఎలా వచ్చింది?
అందరికీ ఇవాళ ఓ సీక్రెట్‌ చెబుతాను. చై (నాగచైతన్య) జిమ్‌ ఎక్కువ చేస్తుంటాడు. తనను కలవొచ్చనే ఉద్దేశంతోనే జిమ్‌కి వెళ్లడం మొదలెట్టాను. అలా మెల్లిగా వర్కౌట్స్‌ మీద నాకూ ఇష్టం పెరిగింది.

► ఎక్కువగా ఒత్తిడికి గురైనప్పుడు ఏం చేయాలంటారు?
నేను డాక్టర్‌ని కాదు ఇవన్నీ చెప్పడానికి. కానీ శ్వాసకు సంబంధించిన వ్యాయామాలు చేయాలి. శ్వాసను అదుపు చేసుకుంటే జీవితాన్ని అదుపు చేసుకున్నట్టే.

► ప్రస్తుతం ఏ సినిమా షూటింగ్‌ చేస్తున్నారు?
తమిళ చిత్రం ‘కాదువాక్కుల రెండు కాదల్‌’ షూటింగ్‌ చేస్తున్నాను. ఈ సినిమా చాలా అంటే చాలా బావుంటుంది. మీ అందరికీ ఈ సినిమా త్వరగా చూపించేయాలనుంది.

► 2021లో మీరు తీసుకున్న నిర్ణయాలేంటి?
 పూర్తి స్థాయి శాకాహారిగానే కొనసాగాలి. యోగా, ధ్యానం ప్రతిరోజూ చేయాలి. మరింత సంతోషంగా ఉండాలి.

మీ అభిప్రాయాలను కింద తెలపండి

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments

మరిన్ని వార్తలు