ట్రోలింగ్‌, నిద్ర లేని రాత్రులు గడిపా: సామ్‌

26 Jan, 2021 20:32 IST|Sakshi

ఏ విషయాన్ని అయినా సరే అభిమానుల చెవిలో ఊదేయడం సమంతకు అలవాటే. కాస్త వీలు దొరికితే చాలు అభిమానులతో కాలక్షేపం చేసేందుకు ఆమె ఎప్పుడూ ముందుంటుంది. తాజాగా ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో ప్రశ్నలను సంధించమని అభిమానులను అడిగింది. ఇంకేముందీ ఫ్యాన్స్‌ రకరకాల ప్రశ్నలతో ఆమెను ఉక్కిరిబిక్కిరి చేశారు. అయినా సరే ఈ భామ అన్నింటికీ ఓపికగా సమాధానమిచ్చింది. ఇప్పటివరకు నటించిన వాటిలో ఏది మీకిష్టమైన పాత్ర అన్న ప్రశ్నకు ఓ బేబీ, ఫ్యామిలీ మ్యాన్‌ రోల్స్‌ అని చెప్పింది. 20 ఏళ్ల వయసులో మీ గురించి చెప్పండి? అన్నదానికి ఏముంటుంది, ఇంకా ఎదగాలి అన్న తాపత్రయం ఒక్కటే ఉండేది అని సమాధానమిచ్చింది. (చదవండి: సమంత పోస్టుపై అభిమానుల విమర్శలు!)


2020లో మధుర జ్ఞాపకాన్ని పంచుకోండి అనగానే రానా పెళ్లి ఫొటోను స్టోరీస్‌లో యాడ్‌ చేసింది. సోషల్‌ మీడియా ట్రోలింగ్‌ను ఎలా ఎదుర్కొంటున్నారు అని ప్రశ్నించగా.. 'ఒకప్పుడు ట్రోలింగ్‌ వల్ల నిద్ర లేని రాత్రులు గడిపాను. కానీ ఇప్పుడు మాత్రం భలే నవ్వొస్తుంది. అయినా వారు ట్రోల్‌ చేస్తున్నారంటే మనం ఎంతో ఎత్తుకు ఎదిగామనిపిస్తుంది' అని చెప్పుకొచ్చింది. ఇక ఈ మధ్యే ఆమె తన డిజైనర్‌ ప్రీతమ్‌ జుల్కర్‌ మీద కాళ్లు పెట్టి కబుర్లాడుతున్న ఫొటో ఎంత వివాదాస్పదమైందో తెలిసిన విషయమే. సామ్‌ హాయిగా సోఫాలో ప్రీతమ్ మీద కాలేసుకుని అతడికి ఐ లవ్‌ యూ చెప్తూ దాన్ని ఇన్‌స్టా స్టోరీలో యాడ్‌ చేసింది. ఈ ఫొటో నెట్టింట దుమారం లేపగా వెంటనే సామ్‌ దాన్ని డిలీట్‌ చేసింది. కానీ అప్పటికే ఆ పోస్ట్‌ స్క్రీన్‌ షాట్లు వైరల్‌ అవడంతో జరగాల్సిన నష్టం జరిగిపోయింది. (చదవండి: రామ్‌చరణ్‌, యశ్‌తో శంకర్‌ మల్టీస్టారర్‌!)

మీ అభిప్రాయాలను కింద తెలపండి

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments

మరిన్ని వార్తలు