లుక్‌ అదుర్స్‌

23 Nov, 2020 06:34 IST|Sakshi

షూటింగ్‌లు, ప్రమోషన్లు అంటూ ఎప్పుడూ బిజీగా ఉండే సినీ సెలబ్రిటీలు ఏమాత్రం కాస్త వీలు కుదిరినా సేదతీరడానికి ఇతర ప్రాంతాల్లో వాలిపోతుంటారు. కుటుంబ సభ్యులతోనో, స్నేహితులతోనో కలిసి వెకేషన్‌ ప్లాన్‌ చేసి సరదాగా ఎంజాయ్‌ చేస్తుంటారు. ఆ ఫొటోల్ని తమ అభిమానుల కోసం సామాజిక మాధ్యమాల్లో పోస్ట్‌ చేస్తుంటారు. కరోనా వంటి ప్రస్తుత పరిస్థితుల్లో సెలబ్రిటీలకు వెకేషన్‌ అంటే గుర్తుకు వచ్చేది మాత్రం మాల్దీవులే.. దక్షిణాదితో పాటు బాలీవుడ్‌ సెలబ్రిటీలు సైతం ఈ మధ్య ఎక్కువగా మాల్దీవుల్లో ఎంజాయ్‌ చేస్తున్నారు.

తాజాగా హీరోయిన్‌ సమంత కూడా వెకేషన్‌ కోసం మాల్దీవుల్లో వాలిపోయారు. అక్కడి తన రూం రిసార్ట్‌ చూపిస్తూ ఓ వీడియోను షేర్‌ చేశారామె. దాంతో పాటు వెనుకవైపు నిల్చొని అదిరిపోయే పోజు ఇచ్చిన మరో ఫొటోను కూడా సమంత పోస్ట్‌ చేశారు. ఇప్పుడు ఈ ఫొటో నెట్టింట్లో తెగ వైరల్‌ అవుతోంది. ‘స్యామ్‌ లుక్‌ అదుర్స్‌’ అంటూ అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. కాగా ఇటీవల మాల్దీవుల్లో వెకేషన్‌ ఎంజాయ్‌ చేసిన వారిలో చిరంజీవి చిన్న కూతురు శ్రీజ, అల్లుడు కల్యాణ్‌ దేవ్, హీరోయిన్‌ తాప్సీ, కాజల్‌ అగర్వాల్‌–గౌతమ్‌ దంపతులు, రకుల్‌ ప్రీత్‌సింగ్‌ ఉన్నారు.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా