ChaySam Divorce: అక్కడ ఒక్కటయ్యారు.. ఇక్కడ ఒక్కటిగా ఉండలేకపోయారు

2 Oct, 2021 17:56 IST|Sakshi

Samantha- Naga Chaitanya divorce:  నాగచైతన్య, సమంత కలిసి నటించిన తొలి చిత్రం 'ఏమాయ చేసావే'లో ఇద్దర మధ్య ప్రేమ పుట్టింది. అందులో పాత్ర ప్రకారం నాగచైతన్య కంటే సమంత పెద్దది, రెండు వేర్వేరు రాష్ట్రాలు, రెండు వేర్వేరు మతాలకు చెందిన వ్యక్తులుగా వారిద్దరు నటించారు. ఆ సినిమాలో సైతం ఓ దశలో ఇద్దరూ వీడిపోతారు. ఎవరి జీవితాల్లో వారు బిజీగా మారిన తర్వాత ఓసారి ఎదురుపడతారు. అప్పుడే ఇద్దరు మాట్లాడుకుని సమస్యలు ఎన్ని ఉన్నా కలిసే ఉండాలని నిర్ణయించుకుంటారు. కథా సుఖాంతం అవుతుంది. ఈ తర్వాత వచ్చిన 'ఆటోనగర్‌ సూర్య'లో నాగచైతన్య, సమంత పాత్రల మధ్య కాన్‌ఫ్లిక్‌ పెద్దగా ఉండదు. 

చదవండి: ఆయన చెప్పిందే నిజమైంది..సామ్‌-చై విడిపోయారు

అక్కినేని కుటుంబ చిత్రంగా వచ్చిన 'మనం'లో మరోసారి నాగచైతన్య, సమంతలు జంటగా నటించారు. సమంతను చూసిన నాగచైతన్య ఆమె ప్రేమను పొందేందుకు విపరీతంగా ట్రై చేస్తుంటాడు. అయితే పూర్వ జన్మలో తామిద్దరం భార్యభర్తలమని సమంతకి గతం గుర్తుకు వస్తుంది. గత జన్మంలో తనను నిర్లక్ష్యం చేసిన భర్త ఈ జన్మలో మళ్లీ ప్రేమ అంటూ వెంట పడుతున్నాడని దూరం పెడుతుంది. కానీ పూర్వ జన్మలో తాను చేసిన తప్పులు గుర్తించిన నాగచైతన్య పాత్ర ఈ జన్మలో రియలైజ్‌ అవుతుంది. నాకు నువ్వే కావాంటూ సమంత పాత్రని ప్రేమగా అర్థిస్తుంది. చివరకు అతని ప్రేమలో నిజాయితీని గుర్తించిన సమంత ఒకే చెప్పడంతో ఒక్కటవుతారు. ఈ సినిమా తర్వాత నిజంగానే అక్కినేని ఇంటి కోడలిగా మారింది సమంత.

పెళ్లైన తర్వాత నాగచైతన్య, సమంత ఇద్దరు జంటగా నటించిన చిత్రం 'మజిలి'. ఒకే కాలనీలో ఎదురెదురుగా ఉండే అమ్మాయి, అబ్బాయి పాత్రల్లో నాగ చైతన్య, సమంతలు నటించారు. టీనేజ్‌ నుంచే నాగచైతన్యను విపరీతంగా ప్రేమిస్తుంది సమంత. కానీ చైతన్య మరో అమ్మాయితో ప్రేమ విఫలమై దేవదాసుగా మారుతాడు. అయినా సరే నాగ చైతన్యే కావాలంటూ సమంత అతన్ని పెళ్లి చేసుకుంటుంది. భార్యగా తనకు ఏ గుర్తింపు ఇవ్వకపోయినా సరే.. మౌనంగా అన్నీ భర్తిస్తూ భర్తను ప్రేమిస్తునే ఉంటుంది. అయితే భార్య ప్రేమను అర్థం చేసుకున​ నాగచైతన్య తన ప్రేమ విషయం చెప్పే క్రమంలో ఇద్దరి మధ్య మనస్పర్థలు వస్తాయి. చివర్లో నాగచైతన్యను వదిలి సమంతా వెళ్లిపోవాలని రైల్వే స్టేషన్‌ చేరుకుంటుంది. అక్కడ మరోసారి ఒకరి మనసు ఒకరు అర్థం చేసుకుని ఒక్కటవడంతో సినిమా ముగుస్తుంది. 

వెండితెర మీద మతాలు, రాష్ట్రాలు, ఇగోలు, మనస్పర్థలు ఇలా ఎన్ని సమస్యలు వచ్చినా పరిష్కరించుకుంటూ ఒక్కటయ్యారు నాగచైతన్య సమంత. ఇద్దరి మధ్యా దూరం కొన్ని వేల మైళ్లయినా , జన్మలు వేరైనా సరే ఒక్కటిగానే కలిసున్నారు. కానీ నిజ జీవితంలో మాత్రం ఒక్కటిగా ఉండలేమంటూ విడాకులు ప్రకటించారు. 

చదవండి: విడాకులపై స్పందించిన ఆర్జీవీ.. వైరల్‌ అవుతున్న ట్వీట్‌

చై-సామ్‌ పెళ్లినాటి  ఫోటోలు

మరిన్ని వార్తలు