అది చూసి ఏడ్చేశాను: సమంత

2 Sep, 2020 20:36 IST|Sakshi

సినిమాలకు కాస్తా విరామం ఇచ్చిన హీరోయిన్‌ సమంత ఇటీవల ఇంటి గార్డెనింగ్‌, వంట చేయ‌డం పనులతో బిజీగా ఉన్నారు. ఇంటికి కావాల్సిన కూరగాయలను, పండ్లను సొంతంగా పండించి, వాటికి కావాల్సిన ఎరువులను కూడా కొన్నింటిని తయారు చేస్తున్నారు. వీటికి సంబంధించిన విశేషాలను ఎప్పటికప్పుడు తన ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకుంటున్నారు. అంతేగాక అభిమానులతో టచ్‌లో ఉండేందుకు వీలైనప్పుడల్లా సోషల్‌ మీడియా ద్వారా వారిని పలకరిస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా సమంత బుధవారం సాయంత్రం ట్విటర్‌లో ఆస్క్‌ మీ సెషన్‌లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా అభిమానుల అడిగిన ప్రశ్నల్లో కొన్నింటికి సామ్‌‌ సమాధానమిచ్చారు. (అద్భుత‌మైన ప‌వ‌న్‌కు హ్యాపీ బ‌ర్త్‌డే)

మీ ఒత్తిడిని ఎలా ఎదుర్కొంటారని ఓ నెటిజన్‌ ప్రశ్నించగా.. ధ్యానం చేయడం మానసిక ఒత్తిడిని తగ్గించుకునేందుకు ఇది ఎంతో ఉపయోగపడిందన్నారు. చివరి సారిగా ఎప్పుడు ఏడిచారని ఓ నెటిజన్‌ ప్రశ్నించారు. దీనిపై స్పందించిన సామ్‌.. ‘ఈ ప్రశ్న అడిగిందుకు సంతోషంగా ఉంది. ఇటీవల ఇంట్లో వాళ్లకు రాషెస్(దద్దుర్లు) అయినప్పుడు అవి చూసి నేను ఏడవడం ప్రారంభించాను.’ అన్నారు. వీకెండ్‌లో రైతులతో కలిసి వ్యవసాయం చేయాలని ఓ అభిమాని సూచించగా.. ‘ఈ ఆలోచన బాగుంది. థాంక్యూ అర్చన. నేను తప్పకుండా దీని గురించి ఆలోచిస్తాను.’ అన్నారు. ఈ ఏడాది గడిచేలోగా ఏం చేయాలాని ప్లాన్‌ చేశారని అడగ్గా.. ఏం ప్లాన్‌ చేసుకోకుండా ఉండటమే మంచి ప్లాన్‌ అని సామ్‌ బదులిచ్చారు. (తొలిసారి ఆ ప్ర‌య‌త్నం చేసిన స‌మంత‌)

కాగా అమెజాన్ ప్రైమ్‌లో ప్రసారం అయ్యే ‘ది ఫ్యామిలీ మ్యాన్’ వెబ్ సిరీస్‌ సెకండ్ సీజన్‌లో సమంత నటిస్తోన్న సంగతి తెలిసిందే.  టెర్రరిస్టుగా నెగటివ్ టచ్ తో కూడిన పాత్రలో నటిస్తోంది. లాక్ డౌన్‌కు ముందే ఈ సీరీస్ షూటింగ్ లో పాల్గొన్న సామ్‌ ఈ సిరీస్‌కు తానే డబ్బింగ్‌ చెప్పుకుంది. ఈ సిరీస్‌లో బాలీవుడ్ న‌టుడు మ‌నోజ్ భాజ్‌పాయ్‌తో పాటు హీరోయిన్ ప్రియ‌మ‌ణి కూడా న‌టిస్తున్నారు. ఇక ఈ వెబ్ సిరీస్ అక్టోబర్ నుంచి అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ కానుంది.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా