సమంత హ్యాండ్‌ బ్యాగు విలువెంతో తెలుసా!

15 Jan, 2021 15:14 IST|Sakshi

స్టార్‌ నటీనటులు ఏం చేసిన అది వార్తల్లో నిలుస్తుంది. వారి వ్యక్తిగత విషయాలను నుంచి వారు ధరించే దుస్తులు, ఖరీదైన యాక్ససరీస్‌, ఫ్యాషన్‌ లుక్‌ గురించి సోషల్‌ మీడియాలో చర్చించుకుంటుంటారు. తాజాగా ఈ జాబితాలోకి స్టార్‌ హీరోయిన్‌ సమంత హ్యాండ్‌ బ్యాగ్‌ చేరింది. ఇటీవల ఎయిర్‌పోర్టులో దర్శనమించిన సమంత ఫొటోలను మీడియా క్లిక్‌ మనిపించింది. దీంతో ఆమె ఫొటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. అయితే ఇందులో సమంత ఎల్లో మిడ్‌టాప్‌, డెనిమ్‌ జాకెట్‌, లేదర్‌ హ్యాండ్‌ బ్యాగ్‌, ట్రావెల్‌ బ్యాగ్‌తో కనిపించారు. (చదవండి: అందుకే సామ్‌ జామ్‌కు శుభం కార్డు)

దీంతో సమంత చేతిలో ఉన్న హ్యాండ్‌ బ్యాగుపై నెటిజన్‌ల కన్ను పడింది. ఎందుకంటే ఆ బ్యాగు ఖరీదు 2 లక్షలకు పైనే ఉంటుందంట. దీంతో అంత ఖరీదైన బ్యాగు సమంత చేతిలో మరింత అందంగా ఉందంటూ కామెంట్స్‌ చేస్తున్నారు. ప్రస్తుతం సమంత విఘ్నేశ్‌ శివన్‌ దర్శకత్వంలో రూపొందుతున్న ‘కాతువాకుల రేండు కాదల్‌’లో అనే తమిళ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో విజయ్‌ సేతుపతికి జోడిగా సమంత నటిస్తున్నారు. ఇటీవల వీరిద్దరిపై కొన్ని సన్నివేశాలను హైదరాబాద్‌లో చిత్రీకరించారు. కాగా ఈ మూవీలో నయతార కీలక పాత్రలో కనిపించనున్నారు. (చదవండి: సమంతకు నో చెప్పిన నాగచైతన్య!)

మీ అభిప్రాయాలను కింద తెలపండి

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments

మరిన్ని వార్తలు