నా గురించే ఆలోచిస్తున్నావా?: సమంత

18 Jan, 2021 13:17 IST|Sakshi

టాలీవుడ్‌ మోస్ట్‌ క్యూట్‌ కపుల్‌ సమంత-నాగ చైతన్య అభిమానులతో ఎప్పుడూ టచ్‌లోనే ఉంటారు. ఈ క్రమంలో చైతూ తనకు తెలీకుండా తీసిన ఫొటోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేశాడు. ఈ ఫొటోలను లవ్‌ స్టోరీ షూటింగ్‌ విరామ సమయంలో సినిమాటోగ్రాఫర్‌ పీసీ శ్రీరామ్‌ క్లిక్‌మనిపించాడు. అందులో చై దేని గురించో దీర్ఘంగా ఆలోచిస్తున్నట్లుగా ఉంది. దీంతో చై భార్య, హీరోయిన్‌ సమంత 'నా గురించే ఆలోచిస్తున్నావా?' అని చిలిపి కామెంట్‌ పెట్టింది. దీనికి చై ఎలాంటి రిప్లై ఇవ్వకపోయినా నెటిజన్లు మాత్రం కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. లేదు లేదు, చైకి ఇప్పుడంత తీరిక లేదు, ఆయనిప్పుడు సాయి పల్లవి కోసం మాత్రమే ఆలోచిస్తున్నాడంటూ ఆటపట్టిస్తున్నారు. మరికొందరు మాత్రం తన జెస్సీ కోసం తలుస్తున్నాడని పరోక్షంగా సమంతనే గుర్తు చేసుకుంటున్నాడని చెప్తున్నారు. (చదవండి: అప్పటివరకూ మేం స్నేహితులమే: సమంత)

ఇదిలా వుంటే సమంత ఉగ్రవాదిగా నటించిన "ఫ్యామిలీ మ్యాన్‌ 2" వెబ్‌ సిరీస్‌ ఫిబ్రవరి 12 నుంచి అమెజాన్‌ ప్రైమ్‌లో ప్రసారం కానుంది. ఇక దర్శకుడు గుణశేఖర్‌ తెరకెక్కించనున్న "శాంకుతలం" దృశ్యకావ్యంలో సామ్‌ హీరోయిన్‌గా కనిపించనుంది. గుణ టీమ్‌ వర్క్స్‌ బ్యానర్‌పై నీలమా గుణ నిర్మించనున్న ఈ సినిమాకు మణిశర్మ సంగీతం అందిస్తున్నారు. మరోవైపు చైతన్య నటించిన "లవ్‌ స్టోరీ" టీజర్‌ ఇటీవలే రిలీజ్‌ అవగా అద్భుతమైన స్పందన లభించింది.  ఈ చిత్రానికి ఫిదా డైరెక్టర్‌ శేఖర్‌ కమ్ముల దర్శకత్వం వహించగా కె.నారాయణదాస్‌ నారంగ్, పి.రామ్మోహన్‌ రావు నిర్మించారు. (చదవండి: ఆయన దృష్టిలో నేనే సూపర్‌ స్టార్‌ : అర్చన)

A post shared by Chay Akkineni (@chayakkineni)

మీ అభిప్రాయాలను కింద తెలపండి

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments

మరిన్ని వార్తలు