అనుష్క కోసం సమంత.. ఏం చేశారంటే

9 Sep, 2023 17:53 IST|Sakshi

యంగ్ టాలెంటెడ్ హీరో నవీన్ పొలిశెట్టి, స్టార్ హీరోయిన్ అనుష్క శెట్టి జంటగా నటించిన ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’ చిత్రం సెప్టెంబర్‌ 7న విడుదలైంది. ఈ సినిమాకు ఆడియెన్స్‌తో పాటు సెలబ్రిటీల నుంచి కూడా ప్రశంసలు అందుతున్నాయి. ఇప్పటికే మెగాస్టార్ చిరంజీవి, దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి, స్టార్ డైరెక్టర్ మారుతి ఈ సినిమాను చూసి అభినందించారు.

(ఇదీ చదవండి: లిప్‌లాక్‌ సీన్‌కు త్రిష ఓకే చెబితే.. హీరోనే వద్దన్నాడు.. కారణం ఇదే!)

తాజాగా స్టార్ హీరోయిన్ సమంత ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’ సినిమాపై ప్రశంసలు కురిపించారు. అనుష్కతో ఆమెకు ఉన్న స్నేహం కోసం సినిమా చూశారు. ఆమె తన ఇన్ స్టాగ్రామ్ ద్వారా స్పందిస్తూ. ఇటీవల కాలంలో ఏ సినిమా కూడా తనను ఇంతగా నవ్వించలేదని చెప్పారు. సినిమాలో అనుష్క ఛార్మింగ్‌గా కనిపించారని చెప్పుకొచ్చారు. ఇందులో నవీన్ పోలిశెట్టి సూపర్బ్ పర్ ఫార్మెన్స్ ఇచ్చాడని తెలిపారు. ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’ టీమ్ అందరికీ కంగ్రాట్స్ అంటూ ఆమె పోస్ట్ చేసింది.

(ఇదీ చదవండి; ఎలిమినేషన్‌ ఎత్తేసిన బిగ్‌బాస్‌.. మరో కొత్త ట్విస్ట్‌!)

ఈ సినిమా అన్నివర్గాల ప్రేక్షకుల్ని ఆకట్టుకుని సూపర్ హిట్ టాక్ రావడంతో  బాక్సాఫీస్‌ వద్ద మంచి వసూళ్లు దక్కించుకుంటోంది. యూఎస్‌లో ఆఫ్‌ మిలియన్‌ డాలర్స్ మార్క్‌ను ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’ చేరుకుంది. వన్ మిలియన్ మైల్ స్టోన్ వైపు  దూసుకెళ్తోంది. రొమాంటిక్ ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్ కథతో ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’ చిత్రాన్ని ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ యువీ క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై వంశీ, ప్ర‌మోద్‌ నిర్మాణంలో దర్శకుడు మ‌హేష్ బాబు.పి తెరకెక్కించారు.

A post shared by Samantha (@samantharuthprabhuoffl)

మరిన్ని వార్తలు