కష్ట సమయంలో అండగా ఉన్నావ్‌.. నాలైఫ్‌లోకి రావడం అదృష్టం: సామ్‌ ఎమోషనల్‌

9 Nov, 2021 18:12 IST|Sakshi

నాగచైతన్యతో విడాకుల తర్వాత సమంత(Samantha) ఎక్కువ సమయం తన స్నేహితులతోనే గడుపుతోంది. ఇటీవల ఆమె తన క్లోజ్‌ ఫ్రెండ్‌ శిల్పా రెడ్డితో కలిసి పుణ్యస్థలాలను దర్శించుకుంది. ఈ సందర్భంగా పలు పూజా కార్యక్రమాలు నిర్వహించింది. తాజాగా సమంత తన స్నేహితురాలు డాక్టర్‌ మంజుల అనగాని పుట్టిన రోజు వేడుకకి హాజరైంది. ఈ పార్టీకి సమంతతో పాటు లేడీ డైరెక్టర్‌ నందిని రెడ్డి కూడా హాజరయ్యారు. ఈ విషయాన్ని సోషల్‌ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంటూ మంజుల గురించి ఆసక్తికరపోస్ట్‌ పెట్టింది సమంత. 


(చదవండి: విడాకుల తర్వాత మరింత పెరిగిన సామ్‌ క్రేజ్‌.. దక్షిణాది తొలి భారత నటిగా గుర్తింపు)

మంజులను ఉద్దేశిస్తూ..నీ లాంటి ఓ స్నేహితురాలు నా జీవితంలోకి రావడం అదృష్ణంగా భావిస్తున్నా. కష్ట సమయంలోనే నిజమైన ఫ్రెండ్ ఎవరో తెలుస్తుందని చెబుతుంటారు. నీ కంటే నిజమైన ఫ్రెండ్ ఎవ్వరూ లేరు డాక్టర్. నేను నిన్ను ఎంతగా ప్రేమిస్తున్నానో నీకు తెలిసి ఉంటుందని అనుకుంటున్నాను. హ్యాపీ బర్త్ డే’అని కామెంట్‌ చేసింది. 

A post shared by Samantha (@samantharuthprabhuoffl)

డాక్టర్‌ మంజుల విషయాకొస్తే.. ఆమె ఓ ప్రముఖ గైనకాలజిస్ట్‌. పద్మశ్రీ అవార్డు గ్రహిత కూడా. మల్టీటాలెంటెడ్ అయిన మంజుల వైద్యంతో పాటు పలు రంగాల్లో రాణిస్తున్నారు. టాలీవుడ్‌కు చెందిన అనేక మంది తారలతో ఆమెకు పరిచయాలు ఉన్నాయి.

మరిన్ని వార్తలు