మరో బిజినెస్‌లోకి ఎంట్రీ ఇస్తున్న సమంత

20 Jun, 2021 20:54 IST|Sakshi

హీరోయిన్‌ సమంత ఓ వైపు సినిమాలు చేస్తూనే మరోవైపు బిజినెస్‌రంగంలోనూ అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. ఇప్పటికే ఆమెకు 'ఏకమ్‌ లర్నింగ్‌' అనే స్కూల్‌తో పాటు 'సాకీ' అనే దుస్తుల లేబుల్‌ కూడా ఉన్న సంగతి తెలిసిందే. ఈ రెండు వ్యాపారాలు ఎంతో సక్సెస్‌ఫుల్‌గా దూసుకెళ్తూ మంచి లాభాలను తెచ్చిపెడుతున్నాయట. కరోనా పాండమిక్‌ టైంలోనూ ఆన్‌లైన్‌ ద్వారా విదేశాల నుంచి కూడా ఆర్డర్స్‌ వస్తుండటంతో సాకీకి మంచి ఆదరణ లభిస్తుందని సమాచారం. ఇక ఇప్పుడు సమంత  మరో వ్యాపారంలోకి అడుగుపెట్టాలనుకుంటుందట.

జ్యువెలరీ బిజెనెస్‌లోకి కూడా ఎంట్రీ ఇవ్వాలని భావిస్తుందట. త్వరలోనే దీనికి సంబంధించి అఫీషియల్‌ అనౌన్స్‌మెంట్‌ వస్తుందని సమాచారం. ఇక ఇప్పటికే హీరోయిన్‌ తమన్నా ‘వైట్ అండ్ గోల్డ్’ అనే పేరుతో జ్యువెలరీ బిజినెస్‌ చేస్తున్కన సంగతి తెలిసిందే. తమన్నా బాటలోనే సామ్‌ కూడా ప‌య‌నిస్తుంద‌నే టాక్ జోరుగా వినిపిస్తుంది. ఇక సినిమాల విషయానికి వస్తే ఫ్యామిలీమెన్‌-2 సిరీస్‌తో దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిన సమంత ప్రస్తుతం శాకుంతలం, కాతువకుల రెండు కాదల్ అనే సినిమాల్లో నటిస్తుంది. 

చదవండి : సమంత నుంచి చాలా విషయాలను నేర్చుకున్నా: నటుడు

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు