Samantha: సమంత 'యశోద' నుంచి బిగ్‌ అప్‌డేట్‌.. గెట్‌ రెడీ

3 May, 2022 16:17 IST|Sakshi

స్టార్‌ హీరోయిన్‌ సమంత ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం యశోద.  హ‌రీష్ శంక‌ర్‌, హ‌రీష్ నారాయ‌ణ్ సంయుక్తంగా దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని శ్రీదేవి మూవీస్‌ బ్యానర్‌ నిర్మించింది. సైన్స్ ఫిక్ష‌న్ థ్రిల్ల‌ర్‌గా రూపుదిద్దుకుంటున్న ఈ  సినిమా నుంచి తాజాగా మేకర్స్‌ అప్‌డేట్‌ను షేర్‌ చేశారు. ‘య‌శోద’ చిత్రానికి సంబంధించిన గ్లింప్స్‌ను మే5 ఉద‌యం 11.07 నిమిషాల‌కు విడుద‌ల చేయ‌నున్న‌ట్లు వెల్లడించారు.

ఈ మేరకు ట్విట్టర్‌లో పోస్ట్‌ చేశారు. కాగా ఈ చిత్రంలోవ‌ర‌ల‌క్ష్మీ శ‌ర‌త్‌కుమార్, ఉన్నీ ముకుంద‌న్ కీల‌క‌పాత్ర‌లో న‌టిస్తున్నారు. మణిశర్మ సంగీతం అందించారు. తెలుగు, తమిళం, కన్నడ, హిందీ, మలయాళ భాషల్లో ఒకేసారి ఆగస్టు12న ఈ సినిమా విడుదల కానుంది. 

మరిన్ని వార్తలు