Samantha : శాకుంతలంలో సమంత ఫస్ట్‌లుక్‌ చూశారా?

21 Feb, 2022 10:49 IST|Sakshi

Samantha First Look In Shakunthalam Is Out: సమంత ప్రధాన పాత్రలో  గుణశేఖర్‌ దర్శకత్వంలో నటిస్తున్న సినిమా శాకుంతలం. హిస్టారికల్ బ్యాక్‌డ్రాప్‌లో భారీ బడ్జెట్‌తో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని  దిల్‌ రాజు ప్రొడక్షన్స్‌, గుణాటీమ్‌ వర్క్స్‌ పతాకాలపై దిల్‌రాజు, నీలిమ గుణ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనులను జరుపుకుంటోంది. త్వరలో విడుదలకు సిద్ధమైన ఈ సినిమా ప్రమోషన్స్‌ను చిత్ర యూనిట్‌ మొదలు పెట్టింది. 

ఇందులో భాగంగా సమంత ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌ను చిత్ర బృందం విడుదల చేసింది. ఇందులో సమంత దేవకన్యలా కనిపిస్తుంది. చుట్టూ జింకలు, నెమళ్లు ఉండగా మధ్యలో సమంత లుక్‌ ఎంతగానో ఆకట్టుకుంటుంది. ఇక ఈ చిత్రంలో అల్లుఅర్జున్ కుమార్తె అల్లుఅర్హ కీల‌క‌పాత్ర‌లో నటిస్తున్న సంగతి తెలిసిందే. సమంతకు జోడిగా దుష్యంతుడి పాత్రలో దేవ్‌ మోహన్‌ నటిస్తున్నారు. చదవండి: నువ్వు లేని జీవితాన్ని ఊహించుకోలేను : సమంత

మరిన్ని వార్తలు